Title (Indic)తాఁకనేల వంగనేల తలఁచుకో యిఁకనైనా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తాఁకనేల వంగనేల తలఁచుకో యిఁకనైనా సోఁకోరిచితేఁ బనులు చొప్పణఁగుఁగా (॥తాఁక॥) పల్లదము లాడఁగానె పంతము లియ్యవలనె అల్లదివో విభుఁడ నేఁ డాఁడు వారికి మొల్లమి నీపాటిబుద్ధి మునుపనె కలిగితె వొల్లనె దొరతనాన నుండవచ్చుఁగా (॥తాఁక॥) చేతులు పైఁజాఁచఁగాను సిగ్గులు వడవల యేతువ లెత్తా దించుక యిందరిలోన నీతి విచారించుకొని నెమ్మది గుట్టుననుంటె రీతితోఁ బెద్దరికము రేఁచుకొనవచ్చుఁగా (॥తాఁక॥) కాఁగిలించుకొనఁగానె కైవము గావలసె మాగిన మోవితేనెల మముబోఁటికి చేఁగదేరఁ గూడితివి శ్రీవెంకటేశ నేఁడు నాఁగువార్ల మీఁద మీఁద నవ్వువచ్చుఁగా English(||pallavi||) tām̐kanela vaṁganela talam̐sugo yim̐kanainā som̐korisidem̐ banulu sŏppaṇam̐gum̐gā (||tām̐ka||) palladamu lāḍam̐gānĕ paṁtamu liyyavalanĕ alladivo vibhum̐ḍa nem̐ ḍām̐ḍu vārigi mŏllami nībāḍibuddhi munubanĕ kaligidĕ vŏllanĕ dŏradanāna nuṁḍavachchum̐gā (||tām̐ka||) sedulu paim̐jām̐sam̐gānu siggulu vaḍavala yeduva lĕttā diṁchuga yiṁdarilona nīdi visāriṁchugŏni nĕmmadi guṭṭunanuṁṭĕ rīdidom̐ bĕddarigamu rem̐sugŏnavachchum̐gā (||tām̐ka||) kām̐giliṁchugŏnam̐gānĕ kaivamu gāvalasĕ māgina movidenĕla mamubom̐ṭigi sem̐gaderam̐ gūḍidivi śhrīvĕṁkaḍeśha nem̐ḍu nām̐guvārla mīm̐da mīm̐da navvuvachchum̐gā