Title (Indic)తామేల వెంగేలాడేరు దవ్వులనుండి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తామేల వెంగేలాడేరు దవ్వులనుండి నా ముంజేత నీవు గట్టిన కంకణ మున్నది (॥తామే॥) నివ్వటిల్ల నాఁమీద నీ మోహము గలిగితే యెవ్వతె యీసడించినా నేమౌను నవ్వుతాఁ గైదండతోడ నన్ను నీవు చేపట్టితే వువ్విళ్ళూరి సవతులువొద్దనఁగఁ గలరా (॥తామే॥) సేసవెట్టి నీవు నాకిచ్చిన చనవు గలిగితే యేసతి పంతమాడినా నేమౌను బాస యిచ్చి నీవు నాపైఁ బాదాలు చాఁచుకుండితే వేసాల చెలు లీపొందు విడిపించఁ గలరా (॥తామే॥) కాతరాన నీవు నన్నుఁ గాఁగిలించుకుండఁగాను యేతుల మాట్లాడుకొంటే నేమౌను నీతితో శ్రీ వెంకటేశ నే నలమేలుమంగను ఆతలీతలివార లౌఁగాదనఁ గలరా English(||pallavi||) tāmela vĕṁgelāḍeru davvulanuṁḍi nā muṁjeda nīvu gaṭṭina kaṁkaṇa munnadi (||tāme||) nivvaḍilla nām̐mīda nī mohamu galigide yĕvvadĕ yīsaḍiṁchinā nemaunu navvudām̐ gaidaṁḍadoḍa nannu nīvu sebaṭṭide vuvviḽḽūri savaduluvŏddanam̐gam̐ galarā (||tāme||) sesavĕṭṭi nīvu nāgichchina sanavu galigide yesadi paṁtamāḍinā nemaunu bāsa yichchi nīvu nābaim̐ bādālu sām̐suguṁḍide vesāla sĕlu lībŏṁdu viḍibiṁcham̐ galarā (||tāme||) kādarāna nīvu nannum̐ gām̐giliṁchuguṁḍam̐gānu yedula māṭlāḍugŏṁṭe nemaunu nīdido śhrī vĕṁkaḍeśha ne nalamelumaṁganu ādalīdalivāra laum̐gādanam̐ galarā