Title (Indic)తామే యెఱుఁగుదురు తమ పొందులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తామే యెఱుఁగుదురు తమ పొందులు ప్రేమములు రేఁచితేను బెరయు వేడుకలు (॥॥) చెలినోరిలో మాట సిగ్గుల లోపలి తేట తెలిపి చెప్పి చూపరే తెఱవలాల పలు సతుల మగఁడు పరాకై వున్నాఁడేమో తలపించరే మీరు తటుకన నిపుడూ (॥॥) పెద్ద కన్నులలో యాస పిడికిటి లోని సేస పొద్దున నెఱిఁగించరే పొలఁతులాల చద్దివేఁడి వలపుల సందడి నున్నాఁడేమో బుద్ధిగా సన్నల నింపు వుట్టించరే (॥॥) అలమేల్మంగలో నవ్వు అరచేతిలోని పువ్వు లలిఁ దారుకాణించరే లలనలాల యిల శ్రీ వేంకటేశ్వరుఁ డియ్యకొని యున్నాఁడేమో కలసె దొలుతే యింకాఁ గరుణ వుట్టించరే English(||pallavi||) tāme yĕṟum̐guduru tama pŏṁdulu premamulu rem̐sidenu bĕrayu veḍugalu (||||) sĕlinorilo māḍa siggula lobali teḍa tĕlibi sĕppi sūbare tĕṟavalāla palu sadula magam̐ḍu parāgai vunnām̐ḍemo talabiṁchare mīru taḍugana nibuḍū (||||) pĕdda kannulalo yāsa piḍigiḍi loni sesa pŏdduna nĕṟim̐giṁchare pŏlam̐tulāla saddivem̐ḍi valabula saṁdaḍi nunnām̐ḍemo buddhigā sannala niṁpu vuṭṭiṁchare (||||) alamelmaṁgalo navvu arasediloni puvvu lalim̐ dārugāṇiṁchare lalanalāla yila śhrī veṁkaḍeśhvarum̐ ḍiyyagŏni yunnām̐ḍemo kalasĕ dŏlude yiṁkām̐ garuṇa vuṭṭiṁchare