Title (Indic)తాఁ గలడు నాకు యేమీఁ దడవలెను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తాఁ గలడు నాకు యేమీఁ దడవలెను చేఁగదేరె మనసెల్లా చెప్పి చూపునేఁటికి (॥తాఁగల॥) యెలయించవద్దుగాని యెట్లైనా నుండుమనవే వలతుఁ గనక యిఁక వద్దన నేను తొలుతనే యెరుఁగుదు దూరితే వెరవఁడు చలివాసి తిరిగీని చండిపార నోపను (॥తాఁగల॥) యీడు వెట్ట వద్దుగాని యెవ్వతెనైనాఁ దేనీవే ఆడుకోఁగాఁ దనవోజ లట్టె మానీనా ఆడనే గడుసు పడె నలయించఁగా నేమి కూడి వుండినచోటను కోపగించఁ దగదు (॥తాఁగల॥) యెడయఁగ వద్దుగాని యెప్పుడైనాఁ గూడనీలే విడువరానియెడకు విసువేఁటికి అడరి శ్రీవెంటేశుఁ డలమేల్మంగను నేను కడలేక నన్ను నేలె కన్నుల మొక్కేను English(||pallavi||) tām̐ galaḍu nāgu yemīm̐ daḍavalĕnu sem̐gaderĕ manasĕllā sĕppi sūbunem̐ṭigi (||tām̐gala||) yĕlayiṁchavaddugāni yĕṭlainā nuṁḍumanave valadum̐ ganaga yim̐ka vaddana nenu tŏludane yĕrum̐gudu dūride vĕravam̐ḍu salivāsi tirigīni saṁḍibāra nobanu (||tām̐gala||) yīḍu vĕṭṭa vaddugāni yĕvvadĕnainām̐ denīve āḍugom̐gām̐ danavoja laṭṭĕ mānīnā āḍane gaḍusu paḍĕ nalayiṁcham̐gā nemi kūḍi vuṁḍinasoḍanu kobagiṁcham̐ dagadu (||tām̐gala||) yĕḍayam̐ga vaddugāni yĕppuḍainām̐ gūḍanīle viḍuvarāniyĕḍagu visuvem̐ṭigi aḍari śhrīvĕṁṭeśhum̐ ḍalamelmaṁganu nenu kaḍalega nannu nelĕ kannula mŏkkenu