Title (Indic)తాళపాకన్నమాచార్య దైవమవు నీవు మాకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తాళపాకన్నమాచార్య దైవమవు నీవు మాకు వేళమె శ్రీహరిఁ గనే వెర వానతిచ్చితివి (॥తాళ॥) గురుఁడవు నీవెసుమ్మీ కుమతి నై ననాకు సరవి బ్రహ్మోపదేశము సేసితి పరమబంధుఁడ వైనా పరికింప నీవెసుమ్మీ వరుస నేఁ జెడకుండ వహించుకొంటివి (॥తాళ॥) తల్లివైన నీవెసుమ్మీ తగిన విషయాలలో పల్లదానఁ బడకుండా బ్రదికించితి అల్లుకొని తోడునీడవైనా నీవెసుమ్మీ చిల్లరమాయలలోనఁ జెడకుండాఁ జేసితి (॥తాళ॥) దాతవు నీవెసుమ్మీ తగు శ్రీవెంకటనాథు నాతలఁపులో నిలిపి నమ్మఁ జేసితి యేతలఁ జూచినా నాకు నేడుగడయు నీవె ఆతల నీతల నన్ను నాడుకొని కాచితి English(||pallavi||) tāḽabāgannamāsārya daivamavu nīvu māgu veḽamĕ śhrīharim̐ gane vĕra vānadichchidivi (||tāḽa||) gurum̐ḍavu nīvĕsummī kumadi nai nanāgu saravi brahmobadeśhamu sesidi paramabaṁdhum̐ḍa vainā parigiṁpa nīvĕsummī varusa nem̐ jĕḍaguṁḍa vahiṁchugŏṁṭivi (||tāḽa||) tallivaina nīvĕsummī tagina viṣhayālalo palladānam̐ baḍaguṁḍā bradigiṁchidi allugŏni toḍunīḍavainā nīvĕsummī sillaramāyalalonam̐ jĕḍaguṁḍām̐ jesidi (||tāḽa||) dādavu nīvĕsummī tagu śhrīvĕṁkaḍanāthu nādalam̐pulo nilibi nammam̐ jesidi yedalam̐ jūsinā nāgu neḍugaḍayu nīvĕ ādala nīdala nannu nāḍugŏni kāsidi