Title (Indic)తాప లేక మేడ లెక్కఁ దలఁచేము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తాప లేక మేడ లెక్కఁ దలఁచేము యేపులేని చిత్తముతో యీహీహీ నేము (॥తాప॥) ఎఱుకమాలినబుద్ధి యెవ్వరైనాఁ బతులంటా తెఱఁగెఱఁగక వీధిఁ దిరిగేము పఱచైన జవరాలు పరులెల్లా మగలంటా వొఱపు నిలిపిన ట్లోహోహో నేము (॥తాప॥) యిందరును హితులంటా యెందైనా సుఖమంటా పొందలేనిబాధఁ బొరలేము మందమతిఁవాడు యెండమావులు చెరువులంటా అందునిందుఁ దిరిగిన ట్లాహాహా నేము (॥తాప॥) మేటివేంకటేశుఁ బాసి మీఁదమీఁద జవులంటా నాటకపు తెరువుల నడిచేము గూటిలో దవ్వులవాఁడు కొండలెల్ల నునుపంటా యేటవెట్టి యేఁగిన ట్లీహీహీ నేము English(||pallavi||) tāba lega meḍa lĕkkam̐ dalam̐semu yebuleni sittamudo yīhīhī nemu (||tāba||) ĕṟugamālinabuddhi yĕvvarainām̐ badulaṁṭā tĕṟam̐gĕṟam̐gaga vīdhim̐ dirigemu paṟasaina javarālu parulĕllā magalaṁṭā vŏṟabu nilibina ṭlohoho nemu (||tāba||) yiṁdarunu hidulaṁṭā yĕṁdainā sukhamaṁṭā pŏṁdalenibādham̐ bŏralemu maṁdamadim̐vāḍu yĕṁḍamāvulu sĕruvulaṁṭā aṁduniṁdum̐ dirigina ṭlāhāhā nemu (||tāba||) meḍiveṁkaḍeśhum̐ bāsi mīm̐damīm̐da javulaṁṭā nāḍagabu tĕruvula naḍisemu gūḍilo davvulavām̐ḍu kŏṁḍalĕlla nunubaṁṭā yeḍavĕṭṭi yem̐gina ṭlīhīhī nemu