Title (Indic)తా నూరకే యా పనులు దడవీఁ గాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తా నూరకే యా పనులు దడవీఁ గాక నేనేమైనాఁ దనమీఁద నేరాలు వేసేనా (॥తానూ॥) యెట్టుండినా నమ్మక తన్నెగసక్కాలాడేనా పెట్టరాని యానలేల పెట్టుకొనీనే గుట్టుతోడఁ దలవంచుకొని వున్నదాన నేను నట్టనడుమఁ దానేల నవ్వులు నవ్వీనే (॥తానూ॥) యెంతసేసినాఁ దనపై యిట్టే నిందలు మోపేనా కాంతలఁ దెచ్చేల తారుకాణ సేసీనే సంతోసాన నాలో నేనే సమ్మతించుకున్నదాన చెంతనుండి మరి నేల సిగ్గులు వడీనే (॥తానూ॥) యేరీతి మెలఁగినాను యెగ్గుపట్టి దూరేనా సారె నన్నే లొడఁబరచఁగ వచ్చీనే కోరి శ్రీవేంకటేశుఁడు కూడినాఁడు దా నన్ను గారవించి యాల యిచ్చకములు నెరపీనే English(||pallavi||) tā nūrage yā panulu daḍavīm̐ gāga nenemainām̐ danamīm̐da nerālu vesenā (||tānū||) yĕṭṭuṁḍinā nammaga tannĕgasakkālāḍenā pĕṭṭarāni yānalela pĕṭṭugŏnīne guṭṭudoḍam̐ dalavaṁchugŏni vunnadāna nenu naṭṭanaḍumam̐ dānela navvulu navvīne (||tānū||) yĕṁtasesinām̐ danabai yiṭṭe niṁdalu mobenā kāṁtalam̐ dĕchchela tārugāṇa sesīne saṁtosāna nālo nene sammadiṁchugunnadāna sĕṁtanuṁḍi mari nela siggulu vaḍīne (||tānū||) yerīdi mĕlam̐ginānu yĕggubaṭṭi dūrenā sārĕ nanne lŏḍam̐barasam̐ga vachchīne kori śhrīveṁkaḍeśhum̐ḍu kūḍinām̐ḍu dā nannu gāraviṁchi yāla yichchagamulu nĕrabīne