Title (Indic)తా నెట్ల నున్నాఁడో తరుణి వినిపించవే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తా నెట్ల నున్నాఁడో తరుణి వినిపించవే కానక నినుఁ గన్న నతనిఁ గన్నట్ల నాయనే (॥తానె॥) కొంతవడిఁ దనుపేరు కోరి నాలుకఁ దలఁతునే కొంతవడి దనసుద్దులు కొమ్మలచే బిందునే కొంతవడి తానున్న కొలువుచిత్తరువు చూతు కాంతయీరీతిఁ బొద్దు గడపుదునే నేను (॥తానె॥) మది నొక్క వేళఁ దనమాట దలపోతునే కదిసి యొకవేళ దన్నుఁ గలలోనఁ గందునే పదములనె వొకవేళ యెదురు నడతు నేఁ దనకు తుద నిట్ల దినదినము దొబ్బుదునే నేనూ (॥తానె॥) సగినములు చూచుచు నే జరపుదునే వొకగడియ వగలఁ దను దూరి లేకలు వ్రాతుఁ గొంతదడవు జిగి నింతలోఁ గూడె శ్రీవెంకటేశ్వరుఁడు మగిడి యల్లాడ నపుడు మలఁగుపయి నిపుడూ English(||pallavi||) tā nĕṭla nunnām̐ḍo taruṇi vinibiṁchave kānaga ninum̐ ganna nadanim̐ gannaṭla nāyane (||tānĕ||) kŏṁtavaḍim̐ danuberu kori nālugam̐ dalam̐tune kŏṁtavaḍi danasuddulu kŏmmalase biṁdune kŏṁtavaḍi tānunna kŏluvusittaruvu sūdu kāṁtayīrīdim̐ bŏddu gaḍabudune nenu (||tānĕ||) madi nŏkka veḽam̐ danamāḍa dalabodune kadisi yŏgaveḽa dannum̐ galalonam̐ gaṁdune padamulanĕ vŏgaveḽa yĕduru naḍadu nem̐ danagu tuda niṭla dinadinamu dŏbbudune nenū (||tānĕ||) saginamulu sūsusu ne jarabudune vŏgagaḍiya vagalam̐ danu dūri legalu vrādum̐ gŏṁtadaḍavu jigi niṁtalom̐ gūḍĕ śhrīvĕṁkaḍeśhvarum̐ḍu magiḍi yallāḍa nabuḍu malam̐gubayi nibuḍū