Title (Indic)తా నెరఁగఁడటవే యీ తారుకాణలెల్లాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తా నెరఁగఁడటవే యీ తారుకాణలెల్లాను రానీవే కాదనేనా రమణుని నీడకు (॥తానె॥) తలఁపు సమ్మతించితే తనువు సమ్మతించును వలపు గలిగితేనే వాడికె గలుగును చలము విడువకున్న సాదించవచ్చుఁ బనులు పలుకులు మంచివైతే పంతమును మంచిదే (॥తానె॥) తగులు దప్పకుండితే తమకముఁ దప్పదు తెగువలు వుట్టితేను తెరఁకువాఁ బుట్టును నగవులు నిండితేను నయము దోడన నిండు తగవులు నిలిపితే తాలిములు నిలుచు (॥తానె॥) చెనకులు మొనపితే సిగ్గులును మొనపును ననుపులు మిగిలితే నమ్మికలు మిగులును యెనసి శ్రీవేంకటేశుఁ డీడకే తా విచ్చేసీ చనవు సతమైతేనే సరసమూ సతము English(||pallavi||) tā nĕram̐gam̐ḍaḍave yī tārugāṇalĕllānu rānīve kādanenā ramaṇuni nīḍagu (||tānĕ||) talam̐pu sammadiṁchide tanuvu sammadiṁchunu valabu galigidene vāḍigĕ galugunu salamu viḍuvagunna sādiṁchavachchum̐ banulu palugulu maṁchivaide paṁtamunu maṁchide (||tānĕ||) tagulu dappaguṁḍide tamagamum̐ dappadu tĕguvalu vuṭṭidenu tĕram̐kuvām̐ buṭṭunu nagavulu niṁḍidenu nayamu doḍana niṁḍu tagavulu nilibide tālimulu nilusu (||tānĕ||) sĕnagulu mŏnabide siggulunu mŏnabunu nanubulu migilide nammigalu migulunu yĕnasi śhrīveṁkaḍeśhum̐ ḍīḍage tā vichchesī sanavu sadamaidene sarasamū sadamu