Title (Indic)తా నెరఁగఁడా యీతగవు లెల్లెడలను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తా నెరఁగఁడా యీతగవు లెల్లెడలను నేనేమైనా తనమీఁద నెపాలు వేసేనా (॥తానె॥) రతివేళమాఁటలు రచ్చలకు నెక్కవు యితవైనవారికి యెగ్గులేదు పతికిని సతికిని పాయదు చుట్టరికము అతిమోహములకును అడ్డాఁకలేదు (॥తానె॥) సిగ్గువడ్డయంతలోనే చేరదు తమకము వెగ్గళించినా నవ్వులు వేసటగావు వొగ్గి వేఁడుకొంటేనే వోదు గదు బీరము కగ్గనిపొందులలోన కపటము లుండవు (॥తానె॥) చనవరిచేఁతలు సాదింపులు గావు యెనసినకూటమికి నెర వేడది ఘనశ్రీవేంకటేశుఁడు కదిసె నన్నింతలొనె వినయముగలచోట వెగటై తోఁచదు English(||pallavi||) tā nĕram̐gam̐ḍā yīdagavu lĕllĕḍalanu nenemainā tanamīm̐da nĕbālu vesenā (||tānĕ||) radiveḽamām̐ṭalu rachchalagu nĕkkavu yidavainavārigi yĕgguledu padigini sadigini pāyadu suṭṭarigamu adimohamulagunu aḍḍām̐kaledu (||tānĕ||) sigguvaḍḍayaṁtalone seradu tamagamu vĕggaḽiṁchinā navvulu vesaḍagāvu vŏggi vem̐ḍugŏṁṭene vodu gadu bīramu kagganibŏṁdulalona kabaḍamu luṁḍavu (||tānĕ||) sanavarisem̐talu sādiṁpulu gāvu yĕnasinagūḍamigi nĕra veḍadi ghanaśhrīveṁkaḍeśhum̐ḍu kadisĕ nanniṁtalŏnĕ vinayamugalasoḍa vĕgaḍai tom̐sadu