Title (Indic)తా నెంత సేసెనో కాని తమకింతు నేనైతే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తా నెంత సేసెనో కాని తమకింతు నేనైతే యీ నేరుపే ఆపెకు మీ రెచ్చరించవలదా (॥తానెం॥) అంతచేసినచేఁతకు అంగన విభునిఁ జూచి చింతించి యేమనెనే చెప్పిరే మీరు పంతమున నాబోఁట్టిడఁతి యైతే నిందుకు మంతనానఁ బట్టి సదమదముగఁ జేసును (॥తానెం॥) రాతిరి రానియందుకు రమణి యాతనిమీఁద ఘాతల నెం తలిగెనే కాఁకతోడను యేతుల నిట్లాఁగనక యిచ్చోటికి రాకున్నా కాతరాన నావంటిది కడమలు వాపును (॥తానెం॥) బలిమిఁ గూడినందుకు భామిని దా సిగ్గువడి యెలమి శ్రీవేంకటేశు నెంత నవ్వెనే అలరుచు నింతలోన ఆతఁడె నన్నుఁ గూడె యిల నాగుణముదై తే నిన్నిటా మెప్పించును English(||pallavi||) tā nĕṁta sesĕno kāni tamagiṁtu nenaide yī nerube ābĕgu mī rĕchchariṁchavaladā (||tānĕṁ||) aṁtasesinasem̐tagu aṁgana vibhunim̐ jūsi siṁtiṁchi yemanĕne sĕppire mīru paṁtamuna nābom̐ṭṭiḍam̐ti yaide niṁdugu maṁtanānam̐ baṭṭi sadamadamugam̐ jesunu (||tānĕṁ||) rādiri rāniyaṁdugu ramaṇi yādanimīm̐da ghādala nĕṁ taligĕne kām̐kadoḍanu yedula niṭlām̐ganaga yichchoḍigi rāgunnā kādarāna nāvaṁṭidi kaḍamalu vābunu (||tānĕṁ||) balimim̐ gūḍinaṁdugu bhāmini dā sigguvaḍi yĕlami śhrīveṁkaḍeśhu nĕṁta navvĕne alarusu niṁtalona ādam̐ḍĕ nannum̐ gūḍĕ yila nāguṇamudai te ninniḍā mĕppiṁchunu