Title (Indic)తా నెంత నీ వెంత తగిలి తగిలి నిన్నుఁ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తా నెంత నీ వెంత తగిలి తగిలి నిన్నుఁ - బూని వలపించి యీకె పొదలెఁ గదవయ్యా (॥తానెంత॥) చిడుముడిఁ వూడిగాలు సేసిసేసి యాపె నీకు కడుఁ జనవరి యాయఁగదవయ్యా నడుమ నూరక నీతో నవ్వి నవ్వి రాజసాన వెడఁగుగర్వాన విఱవీఁగీఁ గదవయ్యా (॥తానెంత॥) మక్కళించి యాపె నీతో మాఁట లాడి యాడి నీకు గక్కననుఁ జుట్టమాయఁ గదవయ్యా చిక్కించుక కొలువులు సేసిసేసి నిలుచుండి వెక్కసపుఁ బంతుములే వెలసెఁ గదవయ్యా (॥తానెంత॥) వొపికతోఁ జన్నుల నిన్నొత్తి యొత్తి యాపె నీకుఁ గాఁపురాలు సేయ నేర్చెఁ గదవయ్యా యేపున శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు నీ పొందులఁ దా నింటిలో నిలిచెఁ గదవయ్యా English(||pallavi||) tā nĕṁta nī vĕṁta tagili tagili ninnum̐ - būni valabiṁchi yīgĕ pŏdalĕm̐ gadavayyā (||tānĕṁta||) siḍumuḍim̐ vūḍigālu sesisesi yābĕ nīgu kaḍum̐ janavari yāyam̐gadavayyā naḍuma nūraga nīdo navvi navvi rājasāna vĕḍam̐gugarvāna viṟavīm̐gīm̐ gadavayyā (||tānĕṁta||) makkaḽiṁchi yābĕ nīdo mām̐ṭa lāḍi yāḍi nīgu gakkananum̐ juṭṭamāyam̐ gadavayyā sikkiṁchuga kŏluvulu sesisesi nilusuṁḍi vĕkkasabum̐ baṁtumule vĕlasĕm̐ gadavayyā (||tānĕṁta||) vŏbigadom̐ jannula ninnŏtti yŏtti yābĕ nīgum̐ gām̐purālu seya nersĕm̐ gadavayyā yebuna śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu nī pŏṁdulam̐ dā niṁṭilo nilisĕm̐ gadavayyā