Title (Indic)తా నెంత నే నెంత తగునా తాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తా నెంత నే నెంత తగునా తాను తేనె వూసి మాటలను తేలించేఁ దానూ (॥తా నెంత॥) రమ్మనఁగా తనతో నే రా నంటినా నాకు అమ్మరో ప్రియము చెప్పీ న దేమె తాను కమ్మి సారెకు నలుగఁ గడదాననా చిమ్ముచు నా కిచ్చకాలు సేయ నేలే తానూ (॥తా నెంత॥) చలమునఁ దన మాఁట జవదాఁటేనా చెలులచేఁ జెప్పించీ చెల్లఁబో వీఁడు చలిమి బలిమి నాతో సారెఁ జెల్లదా వెలి న న్నొడఁబరచీ వెర పేలే తానూ (॥తా నెంత॥) యితరులవలెఁ దన్ను నెగ్గు లెంచేనా అతివినయాలు చేసీ నౌనే తాను యిత వై శ్రీవెంటేశుడిట్టె కూడెను మతిలోని వెలుతులు మరి యాలే తానూ English(||pallavi||) tā nĕṁta ne nĕṁta tagunā tānu tenĕ vūsi māḍalanu teliṁchem̐ dānū (||tā nĕṁta||) rammanam̐gā tanado ne rā naṁṭinā nāgu ammaro priyamu sĕppī na demĕ tānu kammi sārĕgu nalugam̐ gaḍadānanā simmusu nā kichchagālu seya nele tānū (||tā nĕṁta||) salamunam̐ dana mām̐ṭa javadām̐ṭenā sĕlulasem̐ jĕppiṁchī sĕllam̐bo vīm̐ḍu salimi balimi nādo sārĕm̐ jĕlladā vĕli na nnŏḍam̐barasī vĕra pele tānū (||tā nĕṁta||) yidarulavalĕm̐ dannu nĕggu lĕṁchenā adivinayālu sesī naune tānu yida vai śhrīvĕṁṭeśhuḍiṭṭĕ kūḍĕnu madiloni vĕludulu mari yāle tānū