Title (Indic)తా నేమి సేసినాఁడు తనకేలే వట్టిసిగ్గు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తా నేమి సేసినాఁడు తనకేలే వట్టిసిగ్గు పూనిన తన చేఁతలు వొప్పుగొంటి నేను (॥తానే॥) మొగము చూపుమను మొక్కులు మొక్కేఁదనకు నగుమను బత్తితోఁ జెనకే నేను సొగిసి మాఁటాడుమను చుట్టరికము చెప్పేను తగులాయఁ దనకేలే దాఁగి యున్నాఁడిపుడు (॥తానే॥) సరుసఁ గూచుండుమను సమ్మతించి విడెమిచ్చే తెర యెత్తుమను నే బందెము లాడేను సిరులఁ జేకొమ్మను సేవలెల్లాఁ జేసేను గరిమ నింకేలే యాడికపు లోఁగఁదనకు (॥తానే॥) పవ్వళించియుండుమను పాదములొత్తేఁ దనకు చివ్వనరమ్మను తన చెక్కు నొక్కేను ఇవ్వల శ్రీవేంకటేశుఁడింతలోఁ దావచ్చికూడె కువ్వలాయ వలపులు కొంకఁదనకునేలే English(||pallavi||) tā nemi sesinām̐ḍu tanagele vaṭṭisiggu pūnina tana sem̐talu vŏppugŏṁṭi nenu (||tāne||) mŏgamu sūbumanu mŏkkulu mŏkkem̐danagu nagumanu battidom̐ jĕnage nenu sŏgisi mām̐ṭāḍumanu suṭṭarigamu sĕppenu tagulāyam̐ danagele dām̐gi yunnām̐ḍibuḍu (||tāne||) sarusam̐ gūsuṁḍumanu sammadiṁchi viḍĕmichche tĕra yĕttumanu ne baṁdĕmu lāḍenu sirulam̐ jegŏmmanu sevalĕllām̐ jesenu garima niṁkele yāḍigabu lom̐gam̐danagu (||tāne||) pavvaḽiṁchiyuṁḍumanu pādamulŏttem̐ danagu sivvanarammanu tana sĕkku nŏkkenu ivvala śhrīveṁkaḍeśhum̐ḍiṁtalom̐ dāvachchigūḍĕ kuvvalāya valabulu kŏṁkam̐danagunele