Title (Indic)తా నాకుఁ జేసిన మేలు తలఁపులో నే మఱవ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తా నాకుఁ జేసిన మేలు తలఁపులో నే మఱవ పూని నన్నుఁ గరుణించి బుద్దిచెప్పు మనుమీ (॥॥) మనసార తనతోనే మాటలాడ నేర్చుకొంటే నినుపు సెలవి నవ్వ నేర్చుకొంటిని పనులు గొనఁగా తన పాదా లొత్త నేర్చుకొంటి యెనసి తానే నన్ను నింతదానిఁ జేసెనే (॥॥) సొలసి కన్నుల తుదఁజూడ నేరుచుకొంటి నలి రేఁగి రతులఁ జెనక నేర్చితి వెలయ సంగడి నుండి వినయాలు నేర్చుకొంటి నెలకొని తానే నన్ను నేరుపరిఁ జేసెనే (॥॥) పానుపు పై తనుఁ గూడి పై పై మెచ్చ నేర్చుకొంటి ఆనుకొని మోవిచవు లాన నేర్చితి తాను శ్రీ వేంకటేశుఁడు నే నలమేలుమంగను కానిమ్మని యిటువలెఁ గలికిఁగాఁ జేసెనే English(||pallavi||) tā nāgum̐ jesina melu talam̐pulo ne maṟava pūni nannum̐ garuṇiṁchi buddisĕppu manumī (||||) manasāra tanadone māḍalāḍa nersugŏṁṭe ninubu sĕlavi navva nersugŏṁṭini panulu gŏnam̐gā tana pādā lŏtta nersugŏṁṭi yĕnasi tāne nannu niṁtadānim̐ jesĕne (||||) sŏlasi kannula tudam̐jūḍa nerusugŏṁṭi nali rem̐gi radulam̐ jĕnaga nersidi vĕlaya saṁgaḍi nuṁḍi vinayālu nersugŏṁṭi nĕlagŏni tāne nannu nerubarim̐ jesĕne (||||) pānubu pai tanum̐ gūḍi pai pai mĕchcha nersugŏṁṭi ānugŏni movisavu lāna nersidi tānu śhrī veṁkaḍeśhum̐ḍu ne nalamelumaṁganu kānimmani yiḍuvalĕm̐ galigim̐gām̐ jesĕne