Title (Indic)చూడవే యప్పటి నేనే జూటరి నట WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చూడవే యప్పటి నేనే జూటరి నట జాడలు తాఁ గట్టిన పచ్చడమే యెరుఁగు (॥చూడవే॥) ముప్పిరిఁ దారా కుండఁగ ముసుఁగు వెట్టుక వుంటి అప్పటినేనే కల్ల నటవే చూడు నెప్పునఁ దమవొళ్లిది నేర మందురా యెవ్వరు తప్పులు సేసిన వెల్లె దయ్య మెరుఁగుఁ గాక (॥చూడమే॥) యెయ్యడకో తాఁ బోఁగా నిందుకు రమ్మంటి నింతే గయ్యాళి నేనే యట కమ్మటిఁ జూడు నెయ్యమునఁ దనతోడ నిజము నా దేడ కెక్కు అయ్యో తనవొళ్లికడ మాతుమే యెరుఁగూ (॥చూడవే॥) చెంత దాఁ బిలచుదాఁక సిగ్గున నుండితి నింతే పంతము నాదే యట బలువు చూడు యింతిరో శ్రీవెంకటేశుఁ డిప్పు డిట్టె నన్నుఁ గూడె పొంతల తనతగవు పొరు గెల్లా నెరుఁగూ English(||pallavi||) sūḍave yappaḍi nene jūḍari naḍa jāḍalu tām̐ gaṭṭina pachchaḍame yĕrum̐gu (||sūḍave||) muppirim̐ dārā kuṁḍam̐ga musum̐gu vĕṭṭuga vuṁṭi appaḍinene kalla naḍave sūḍu nĕppunam̐ damavŏḽlidi nera maṁdurā yĕvvaru tappulu sesina vĕllĕ dayya mĕrum̐gum̐ gāga (||sūḍame||) yĕyyaḍago tām̐ bom̐gā niṁdugu rammaṁṭi niṁte gayyāḽi nene yaḍa kammaḍim̐ jūḍu nĕyyamunam̐ danadoḍa nijamu nā deḍa kĕkku ayyo tanavŏḽligaḍa mādume yĕrum̐gū (||sūḍave||) sĕṁta dām̐ bilasudām̐ka sigguna nuṁḍidi niṁte paṁtamu nāde yaḍa baluvu sūḍu yiṁtiro śhrīvĕṁkaḍeśhum̐ ḍippu ḍiṭṭĕ nannum̐ gūḍĕ pŏṁtala tanadagavu pŏru gĕllā nĕrum̐gū