Title (Indic)చూతము నీబలుములు సుద్దు లింతే సేమిటికి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చూతము నీబలుములు సుద్దు లింతే సేమిటికి పొతరము చూపరాదా పొరుగువారి పయిని (॥॥) పలుమారు నవ్వేవు పైఁ జెయ్యివేసేవు చలములే సేసేవు సారెసారెకు వలపు నీకు బాఁతైతే వద్దనున్న కాంతలఁ మొలకచన్నులమీఁద మోపరాదా గోరు (॥॥) భావించి చూచేవు పంతములాడుకొనేవు కావరించి పెనఁగేవు గర్వానను లా వింత నీకుఁ గలితే లలితో వారసతులఁ మోవులపైఁ బల్లుమోపి ముట్టరాదా కొప్పులు (॥॥) సరసమూలాడేవు చనవిచ్చి కూడేవు విరుల వేసేవు శ్రీ వేంకటేశుఁడా మరిగితి నలమేలుమంగను నేనూవూడిగపుఁ తరుణులతొడలపై తాచరాదా పాదాలు English(||pallavi||) sūdamu nībalumulu suddu liṁte semiḍigi pŏdaramu sūbarādā pŏruguvāri payini (||||) palumāru navvevu paim̐ jĕyyivesevu salamule sesevu sārĕsārĕgu valabu nīgu bām̐taide vaddanunna kāṁtalam̐ mŏlagasannulamīm̐da mobarādā goru (||||) bhāviṁchi sūsevu paṁtamulāḍugŏnevu kāvariṁchi pĕnam̐gevu garvānanu lā viṁta nīgum̐ galide lalido vārasadulam̐ movulabaim̐ ballumobi muṭṭarādā kŏppulu (||||) sarasamūlāḍevu sanavichchi kūḍevu virula vesevu śhrī veṁkaḍeśhum̐ḍā marigidi nalamelumaṁganu nenūvūḍigabum̐ taruṇuladŏḍalabai tāsarādā pādālu