Title (Indic)చిత్తగింతువు రావయ్యా చిల్లరపరాకు మాని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చిత్తగింతువు రావయ్యా చిల్లరపరాకు మాని హత్తి తారుకాణ వచ్చీనప్పుడే నీకు (॥॥) చిగురాకు మోవిమీఁదఁ జెలి యీడేమాఁటలు మిగులాఁ దేనెలకంటే మించుఁదీపులు జిగిమించ నీతోడఁ జేసేటిచెలుములు చిగురుఁగండెలకంటెఁ జిక్కించేబందనలు (॥॥) తమ్మిరేకుఁగన్నులలోఁ దళుకనేచూపులు తుమ్మిదపౌఁజులకంటేఁ దూరిపారును వుమ్మగిలుఁబయ్యదలో నుండేటికుచములు నిమ్మపండ్లు కంటేను నీకుఁ గానుకలౌను (॥॥) లతలచేతులు చాఁచి లాచేటికాఁగిలి రతిఁ బెండ్లిచవికకంటే రమ్యమైనది యితివై శ్రీవేంకటేశ యేలితివి నీమోహపుఁ సతికంటే నెక్కుడు జాణతనాలు English(||pallavi||) sittagiṁtuvu rāvayyā sillarabarāgu māni hatti tārugāṇa vachchīnappuḍe nīgu (||||) sigurāgu movimīm̐dam̐ jĕli yīḍemām̐ṭalu migulām̐ denĕlagaṁṭe miṁchum̐dībulu jigimiṁcha nīdoḍam̐ jeseḍisĕlumulu sigurum̐gaṁḍĕlagaṁṭĕm̐ jikkiṁchebaṁdanalu (||||) tammiregum̐gannulalom̐ daḽuganesūbulu tummidabaum̐julagaṁṭem̐ dūribārunu vummagilum̐bayyadalo nuṁḍeḍigusamulu nimmabaṁḍlu kaṁṭenu nīgum̐ gānugalaunu (||||) ladalasedulu sām̐si lāseḍigām̐gili radim̐ bĕṁḍlisavigagaṁṭe ramyamainadi yidivai śhrīveṁkaḍeśha yelidivi nīmohabum̐ sadigaṁṭe nĕkkuḍu jāṇadanālu