Title (Indic)చిత్తగించవోయి నీవు శిరసువంచుకొనక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చిత్తగించవోయి నీవు శిరసువంచుకొనక బిత్తరాన నీకె నీపై ప్రియము చల్లీని (॥॥) పలుచనిసిగ్గుతోడ బాసికము గట్టుకొని చెలరేఁగి సతి నీపై సేసచల్లీని చెలులమాటుననుండి చిప్పిలుఁదమకమున తళుకుఁజూపుల నిన్ను తప్పక చూచీని (॥॥) చెంది మురిపెముతోడ సింగారించుకొని కందువ లంటుచు నీకాలుదొక్కీని సందడివేళలందు జాణతనాలాడి నీకు ముందుముందుగాఁదాను మోవి చూపీని (॥॥) గాటఁపుటాసలతోడి కంకణము నీకుఁగట్టి పీఁటమీఁదఁగూచుండి పెండ్లాడీని యీటున శ్రీవేంకటేశ యిటు నన్ను గూడితివి మేటియై యిందుకు నాపె మెచ్చు మెచ్చీని English(||pallavi||) sittagiṁchavoyi nīvu śhirasuvaṁchugŏnaga bittarāna nīgĕ nībai priyamu sallīni (||||) palusanisiggudoḍa bāsigamu gaṭṭugŏni sĕlarem̐gi sadi nībai sesasallīni sĕlulamāḍunanuṁḍi sippilum̐damagamuna taḽugum̐jūbula ninnu tappaga sūsīni (||||) sĕṁdi muribĕmudoḍa siṁgāriṁchugŏni kaṁduva laṁṭusu nīgāludŏkkīni saṁdaḍiveḽalaṁdu jāṇadanālāḍi nīgu muṁdumuṁdugām̐dānu movi sūbīni (||||) gāḍam̐puḍāsaladoḍi kaṁkaṇamu nīgum̐gaṭṭi pīm̐ṭamīm̐dam̐gūsuṁḍi pĕṁḍlāḍīni yīḍuna śhrīveṁkaḍeśha yiḍu nannu gūḍidivi meḍiyai yiṁdugu nābĕ mĕchchu mĕchchīni