Title (Indic)చిత్తా అవధారు జియ్య పరా కెచ్చరికె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చిత్తా అవధారు జియ్య పరా కెచ్చరికె హత్తి కానుక లిచ్చేరు అదె రాజరాజులు (॥చిత్తా॥) రామ రఘ కుల వీర రాజీవ లోచన కోమల శ్యామల వర్ణ కొలువు వేళ వామ దేవాది మునులు వారె, సుగ్రీవుఁడు వాఁడె వేమారును వానర వీరులు మొక్కేరు (॥చిత్తా॥) దేవ సీతాస మేత ధీర లోక నాయక భావించ నవధరించు పౌఁజువేళ పావని యల్లవాఁడె భల్లూకపతి వీఁడె సేవించీని భరతునిఁ జేకొను శత్రుఘ్నుని (॥చిత్తా॥) శ్రీమదయోధ్యా విహార శ్రీ వేంకటనివాస సామజ వాజి రథాల సందడివేళ సౌమిత్రి యీవంక విభీషణుఁడు నావలివంక నీ మహిమలెల్లా మెచ్చి నీకు విన్నవించేరు English(||pallavi||) sittā avadhāru jiyya parā kĕchcharigĕ hatti kānuga lichcheru adĕ rājarājulu (||sittā||) rāma ragha kula vīra rājīva losana komala śhyāmala varṇa kŏluvu veḽa vāma devādi munulu vārĕ, sugrīvum̐ḍu vām̐ḍĕ vemārunu vānara vīrulu mŏkkeru (||sittā||) deva sīdāsa meda dhīra loga nāyaga bhāviṁcha navadhariṁchu paum̐juveḽa pāvani yallavām̐ḍĕ bhallūgabadi vīm̐ḍĕ seviṁchīni bharadunim̐ jegŏnu śhatrughnuni (||sittā||) śhrīmadayodhyā vihāra śhrī veṁkaḍanivāsa sāmaja vāji rathāla saṁdaḍiveḽa saumitri yīvaṁka vibhīṣhaṇum̐ḍu nāvalivaṁka nī mahimalĕllā mĕchchi nīgu vinnaviṁcheru