Title (Indic)చిన్నవానివలె నెంత చెప్పించుకొనేవు నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చిన్నవానివలె నెంత చెప్పించుకొనేవు నీవు యెన్నరాని రతులకు నెదురుకోవలదా (॥చిన్న॥) చెంతనుండే చెలి నిన్నుఁ జెనకిన చెనకులు చింతతోడఁ దలవంచి సిగ్గువడేవు వింతవాఁడవా నీవు వేడుకకాఁడవు తొల్లె దొంతర వలపులకు దోసిలొగ్గవలదా (॥చిన్న॥) ననుపున నాతి నీతో నవ్వే నవ్వులకు వొనరఁగ నీచేతుల నొడ్డుకొనేవు ననుచనివాఁడవా నంటుతో దొరవు నీవు పెనఁగే తమకానకుఁ బ్రియపడవలదా (॥చిన్న॥) కోమలి శ్రీవేంకటేశ కూడె నీ కూటములకు మోము చూచి యంతలోనే మొక్కు మొక్కేవు సామాన్యపువాఁడవా సర్వేశ్వరుఁడ విదె గోమున నెంతవడైనాఁ గొసరఁగ వలదా English(||pallavi||) sinnavānivalĕ nĕṁta sĕppiṁchugŏnevu nīvu yĕnnarāni radulagu nĕdurugovaladā (||sinna||) sĕṁtanuṁḍe sĕli ninnum̐ jĕnagina sĕnagulu siṁtadoḍam̐ dalavaṁchi sigguvaḍevu viṁtavām̐ḍavā nīvu veḍugagām̐ḍavu tŏllĕ dŏṁtara valabulagu dosilŏggavaladā (||sinna||) nanubuna nādi nīdo navve navvulagu vŏnaram̐ga nīsedula nŏḍḍugŏnevu nanusanivām̐ḍavā naṁṭudo dŏravu nīvu pĕnam̐ge tamagānagum̐ briyabaḍavaladā (||sinna||) komali śhrīveṁkaḍeśha kūḍĕ nī kūḍamulagu momu sūsi yaṁtalone mŏkku mŏkkevu sāmānyabuvām̐ḍavā sarveśhvarum̐ḍa vidĕ gomuna nĕṁtavaḍainām̐ gŏsaram̐ga valadā