Title (Indic)సింగారమూరితివి చిత్తజగురుడఁవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) సింగారమూరితివి చిత్తజగురుడఁవు సంగతిఁ జూచేరు మిమ్ము సాసముఖా (॥సింగా॥) పూవులతెప్పలమీఁద పొలఁతులు నీవు నెక్కి పూవులాకసము మోవఁ బూచి చల్లుచు దేవదుందుభులు మ్రోయ దేవతలు గొలువఁగా సావధానమగు నీకు సాసముఖా (॥సింగా॥) అంగరంగవైభవాల నమరకామినులాడ నింగినుండి దేవతలు నిన్నుఁ జూడఁగా సంగీతతాళవాద్య చతురతలు మెరయ సంగడిఁ దేలేటి మీకు సాసముఖా (॥సింగా॥) పరగఁ గోనేటిలోన పసిడి మేడనుండి అరిది నిందిరయు నీవారగించి గరిమ శ్రీవేంకటేశ కనులపండువ గాఁగ సరవి నోలాడు మీకు సాసముఖా English(||pallavi||) siṁgāramūridivi sittajaguruḍam̐vu saṁgadim̐ jūseru mimmu sāsamukhā (||siṁgā||) pūvuladĕppalamīm̐da pŏlam̐tulu nīvu nĕkki pūvulāgasamu movam̐ būsi sallusu devaduṁdubhulu mroya devadalu gŏluvam̐gā sāvadhānamagu nīgu sāsamukhā (||siṁgā||) aṁgaraṁgavaibhavāla namaragāminulāḍa niṁginuṁḍi devadalu ninnum̐ jūḍam̐gā saṁgīdadāḽavādya saduradalu mĕraya saṁgaḍim̐ deleḍi mīgu sāsamukhā (||siṁgā||) paragam̐ goneḍilona pasiḍi meḍanuṁḍi aridi niṁdirayu nīvāragiṁchi garima śhrīveṁkaḍeśha kanulabaṁḍuva gām̐ga saravi nolāḍu mīgu sāsamukhā