Title (Indic)సిగ్గువడ నిఁకనేల చెప్పరాదా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) సిగ్గువడ నిఁకనేల చెప్పరాదా వెగ్గళించ(చె?) నీ వలపు విభుఁడు నీకెవ్వఁడే (॥సిగ్గు॥) ప్రేమమున వేగుదాఁకా పిప్పి సేసినట్టిమోవి కామతంత్రముల చొక్కుకన్నుల కావి మోములోఁ గళలు దేరెమోనముతో వసివాడు యేమే నీకెక్కడిదే యెవ్వఁడు భోగించెనే (॥సిగ్గు॥) ననల విరులకొప్పు నలఁగిన జోకలు చనుఁగవ మీఁదటి శశిరేకలు పెనఁగిన రతికేళి పెంజెమటజారులు పెనగొని యెక్కడివే ప్రియుఁడు నీకెవ్వఁడే (॥సిగ్గు॥) మేర మీరె ముక్కునను మిక్కిలి నిటూరుపులు తేరెను మేఁదీఁగె కొత్తతీరుపులు యీరీతి నిన్ను శ్రీవేంకటేశుఁడు గూడెననేవు కారణమెట్టు గలిగె ఘనుఁడితఁడెవ్వఁడే English(||pallavi||) sigguvaḍa nim̐kanela sĕpparādā vĕggaḽiṁcha(sĕ?) nī valabu vibhum̐ḍu nīgĕvvam̐ḍe (||siggu||) premamuna vegudām̐kā pippi sesinaṭṭimovi kāmadaṁtramula sŏkkugannula kāvi momulom̐ gaḽalu derĕmonamudo vasivāḍu yeme nīgĕkkaḍide yĕvvam̐ḍu bhogiṁchĕne (||siggu||) nanala virulagŏppu nalam̐gina jogalu sanum̐gava mīm̐daḍi śhaśhiregalu pĕnam̐gina radigeḽi pĕṁjĕmaḍajārulu pĕnagŏni yĕkkaḍive priyum̐ḍu nīgĕvvam̐ḍe (||siggu||) mera mīrĕ mukkunanu mikkili niḍūrubulu terĕnu mem̐dīm̐gĕ kŏttadīrubulu yīrīdi ninnu śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕnanevu kāraṇamĕṭṭu galigĕ ghanum̐ḍidam̐ḍĕvvam̐ḍe