Title (Indic)చిఱుత నవ్వులేల సిగ్గులు వడఁగనేల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చిఱుత నవ్వులేల సిగ్గులు వడఁగనేల గుఱిఁ దలరాయి సేసుకొంద మిఁక లేవయ్యా (॥చిఱు॥) చెప్పఁబోతేఁ బసలేవు చేసిన నీచేఁతలివి యిప్పటి చీఁకటితప్పులివియేకాని వుప్పటించి యాడకుండా వూరివారికెల్లాను చప్పుడుజాగంటవేసి చాటుదములేవయ్యా (॥చిఱు॥) నవ్వఁబోతేఁ బసలేదు నడవడి లోననెల్లా పువ్వుల కురపిదానిఁ బొందుటేకాని రవ్వ నిన్నుఁ జేయకుండా రచ్చలోని వారికెల్లా అవ్వల లేకలువ్రాసి అంపుదము లేవయ్యా (॥చిఱు॥) పట్టఁబోతేఁ బసలేదు పైపై నీనేరమి వొట్టి చీరలుదీసిన దొక్క టేకాని నెట్టన శ్రీ వెంకటేశ నీవు నన్నేలితివి నీ చుట్టాలకు గురిసేసి చూపుదములేవయ్యా English(||pallavi||) siṟuda navvulela siggulu vaḍam̐ganela guṟim̐ dalarāyi sesugŏṁda mim̐ka levayyā (||siṟu||) sĕppam̐bodem̐ basalevu sesina nīsem̐talivi yippaḍi sīm̐kaḍidappuliviyegāni vuppaḍiṁchi yāḍaguṁḍā vūrivārigĕllānu sappuḍujāgaṁṭavesi sāḍudamulevayyā (||siṟu||) navvam̐bodem̐ basaledu naḍavaḍi lonanĕllā puvvula kurabidānim̐ bŏṁduḍegāni ravva ninnum̐ jeyaguṁḍā rachchaloni vārigĕllā avvala legaluvrāsi aṁpudamu levayyā (||siṟu||) paṭṭam̐bodem̐ basaledu paibai nīnerami vŏṭṭi sīraludīsina dŏkka ṭegāni nĕṭṭana śhrī vĕṁkaḍeśha nīvu nannelidivi nī suṭṭālagu gurisesi sūbudamulevayyā