Title (Indic)శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ వరము నొసఁగవయ్యా వాసుదేవ కృష్ణ (॥శర॥) మద్దులు విరిచినట్టి మాధవ కృష్ణ సుద్దులు చెప్పవయ్యా అచ్చుత కృష్ణ వొద్దు రాఁగదవయ్యా ఉపేంద్రకృష్ణ ముద్దులు గురియవయ్యా ముకుందకృష్ణ (॥శర॥) గొల్లెతల మరిగిన గోవింద కృష్ణ చెల్లునయ్యా నీచేఁతలు శ్రీధరకృష్ణ అల్లన దొంగాడవయ్య హరికృష్ణ మల్లుల గెలిచినట్టి మధుసూదన కృష్ణ (॥శర॥) గోవులఁగాచినయట్టి గోపాలకృష్ణ కైవశమై మమ్మేలు శ్రీకరకృష్ణ నా విన్నపమాలించు నారాయణ కృష్ణ సేవకుఁడఁ జుమ్మీ నీకు శ్రీవేంకటకృష్ణ English(||pallavi||) śharaṇu śharaṇu nīgu jagadegabadi kṛṣhṇa varamu nŏsam̐gavayyā vāsudeva kṛṣhṇa (||śhara||) maddulu virisinaṭṭi mādhava kṛṣhṇa suddulu sĕppavayyā achchuda kṛṣhṇa vŏddu rām̐gadavayyā ubeṁdrakṛṣhṇa muddulu guriyavayyā muguṁdakṛṣhṇa (||śhara||) gŏllĕdala marigina goviṁda kṛṣhṇa sĕllunayyā nīsem̐talu śhrīdharakṛṣhṇa allana dŏṁgāḍavayya harikṛṣhṇa mallula gĕlisinaṭṭi madhusūdana kṛṣhṇa (||śhara||) govulam̐gāsinayaṭṭi gobālakṛṣhṇa kaivaśhamai mammelu śhrīgarakṛṣhṇa nā vinnabamāliṁchu nārāyaṇa kṛṣhṇa sevagum̐ḍam̐ jummī nīgu śhrīveṁkaḍakṛṣhṇa