Title (Indic)సేయవయ్య నీవు సేసే చేఁత లెల్లాను మా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) సేయవయ్య నీవు సేసే చేఁత లెల్లాను మా- పాయపు వయసే పో భ్రమయించేది (॥సేయ॥) పక్కున నీవు మాతో బలిమి చూపిన మా- జక్కవకుచములేపో సాదించేవి చక్కఁగా నీవెంతేసి సాములు సేసి వచ్చినా వెక్కసపుమాఁటలే పో వేటువేసేవి (॥సేయ॥) చెలరేఁగి నీవు మాపై చేతు లెంత చాఁచినాను సొలపుఁజూపులేపో సూడువట్టేవి తొలఁగక సరసాన దొమ్మి యెంతసేసినా మా- మొలకనవ్వులేపో ముంచుకొనేవి (॥సేయ॥) చిత్తగించి కాఁగిటను చేపట్టులకుఁ జొచ్చితే తత్తరపు సిగ్గులే పంతము గోనేవి యిత్తల శ్రీవేంకటేశ యెనసితి విట్లానే లత్తుక గోరివన్నెలే లావుచూపేవి English(||pallavi||) seyavayya nīvu sese sem̐ta lĕllānu mā- pāyabu vayase po bhramayiṁchedi (||seya||) pakkuna nīvu mādo balimi sūbina mā- jakkavagusamulebo sādiṁchevi sakkam̐gā nīvĕṁtesi sāmulu sesi vachchinā vĕkkasabumām̐ṭale po veḍuvesevi (||seya||) sĕlarem̐gi nīvu mābai sedu lĕṁta sām̐sinānu sŏlabum̐jūbulebo sūḍuvaṭṭevi tŏlam̐gaga sarasāna dŏmmi yĕṁtasesinā mā- mŏlaganavvulebo muṁchugŏnevi (||seya||) sittagiṁchi kām̐giḍanu sebaṭṭulagum̐ jŏchchide tattarabu siggule paṁtamu gonevi yittala śhrīveṁkaḍeśha yĕnasidi viṭlāne lattuga gorivannĕle lāvusūbevi