Title (Indic)సేసినదెల్లాఁ జేఁత చెల్లుఁబడాయ మీకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) సేసినదెల్లాఁ జేఁత చెల్లుఁబడాయ మీకు వెూసులుగా నవ్వరాదా మోహమెల్లాఁ గంటిమి (॥॥) దగ్గరనుంటే మీకు తమకము వుట్టుఁగాక సిగ్గువ డెల్లంతనుంటే చింతరేఁగదా యెగ్గులేదు పతితొడ యెక్కుక కూచుండఁగదే వెగ్గళించి కాదనేమా వెరుపేల ఇఁకను (॥॥) మొగములు చూచుకొంటే ముచ్చట లీడేరుఁగాక నిగిడి తలవంచితే నిండదా కాఁక తగవౌమగనితోను దట్టించి మాటాడఁగదే జగడించేవా రున్నారా సటలేల ఇఁకను (॥॥) ఇట్టె కాఁగిలించుకొంటే నితవులై వుండుఁగాక గుట్టుననుంటే చెమట గుబులుకోదా జట్టిగొని శ్రీ వేంకటేశ్వరుఁడు నన్నిటు గూడె ఱట్టు కొత్తగా నయ్యెరా గుట్టేల ఇఁకను English(||pallavi||) sesinadĕllām̐ jem̐ta sĕllum̐baḍāya mīgu vĕూsulugā navvarādā mohamĕllām̐ gaṁṭimi (||||) daggaranuṁṭe mīgu tamagamu vuṭṭum̐gāga sigguva ḍĕllaṁtanuṁṭe siṁtarem̐gadā yĕgguledu padidŏḍa yĕkkuga kūsuṁḍam̐gade vĕggaḽiṁchi kādanemā vĕrubela im̐kanu (||||) mŏgamulu sūsugŏṁṭe muchchaḍa līḍerum̐gāga nigiḍi talavaṁchide niṁḍadā kām̐ka tagavaumaganidonu daṭṭiṁchi māḍāḍam̐gade jagaḍiṁchevā runnārā saḍalela im̐kanu (||||) iṭṭĕ kām̐giliṁchugŏṁṭe nidavulai vuṁḍum̐gāga guṭṭunanuṁṭe sĕmaḍa gubulugodā jaṭṭigŏni śhrī veṁkaḍeśhvarum̐ḍu nanniḍu gūḍĕ ṟaṭṭu kŏttagā nayyĕrā guṭṭela im̐kanu