Title (Indic)చేరి చనవులే నీవు చెల్లించవయ్యా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చేరి చనవులే నీవు చెల్లించవయ్యా వలవని వాసు లింక వద్దు నీకు నయ్యా (॥చేరి॥) కాంతలకుఁ బతులతో గబ్బితనమే వన్నె కొంతపుఁజూపుతోడికోపమే వన్నె మంతుకెక్కే గుట్టుతోడిమంకుఁదనమే వన్నె ఇంతలో మీకు నెగ్గు లెంచనేఁటికయ్యా (॥చేరి॥) వెలలేని కొసరుల వెంగెపుమాటలే వన్నె చలివాసినట్టి రాజసములే వన్నె అలమిపట్టినవేళ నానలు పెట్టుటే వన్నె యెలమి నాపెకు నీకు నేఁటిచలమయ్యా (॥చేరి॥) వొనగూడివున్న వేళ వుద్దండములే వన్నె చనవులసరసజంకెనే వన్నె యెనసి శ్రీవేంకటేశ యీపె నీ కిదే వన్నె యెనలేనితరితీపు లేఁటి కింకా నయ్యా English(||pallavi||) seri sanavule nīvu sĕlliṁchavayyā valavani vāsu liṁka vaddu nīgu nayyā (||seri||) kāṁtalagum̐ badulado gabbidaname vannĕ kŏṁtabum̐jūbudoḍigobame vannĕ maṁtugĕkke guṭṭudoḍimaṁkum̐daname vannĕ iṁtalo mīgu nĕggu lĕṁchanem̐ṭigayyā (||seri||) vĕlaleni kŏsarula vĕṁgĕbumāḍale vannĕ salivāsinaṭṭi rājasamule vannĕ alamibaṭṭinaveḽa nānalu pĕṭṭuḍe vannĕ yĕlami nābĕgu nīgu nem̐ṭisalamayyā (||seri||) vŏnagūḍivunna veḽa vuddaṁḍamule vannĕ sanavulasarasajaṁkĕne vannĕ yĕnasi śhrīveṁkaḍeśha yībĕ nī kide vannĕ yĕnalenidaridību lem̐ṭi kiṁkā nayyā