Title (Indic)చెప్పితే నెవ్వరికైనా సేసిన దోసము వాసు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చెప్పితే నెవ్వరికైనా సేసిన దోసము వాసు చిప్పిల నీవిందుకుఁగా సిగ్గువడకు వయ్యా (॥చెప్పి॥) అంతటనుండే మమ్మేల ఆకెవేళ లడిగేవు మంతనాన నున్నదిదే మాటాడరాదా యెంత కొంచేవు నీవల్ల నేమినేరమి గలదో పంత మిచ్చి యిప్పుడే తప్పక వేఁడుకోవయ్యా (॥చెప్పి॥) చేముంచి అప్పటి మాతో చేన్న వేమి సేసేవు రామయెదుటికి నీవె రారాదా యేమరి నీవెందైనా నెంగిలి సేకొంటివో ఆముకొని యిప్పుడే సద్దాత్ముఁడవు గావయ్యా (॥చెప్పి॥) యిమ్ముల మాచేత నెట్టు యెడవట లాడించేవు కొమ్మ నిప్పుడే వచ్చి కూడఁగరాదా యెమ్మెల శ్రీవేంకటేశ యెంతవుద్దండీఁడవైనా నెమ్మిఁగూడితి విప్పుడే నిజమియ్యవయ్యా English(||pallavi||) sĕppide nĕvvarigainā sesina dosamu vāsu sippila nīviṁdugum̐gā sigguvaḍagu vayyā (||sĕppi||) aṁtaḍanuṁḍe mammela āgĕveḽa laḍigevu maṁtanāna nunnadide māḍāḍarādā yĕṁta kŏṁchevu nīvalla neminerami galado paṁta michchi yippuḍe tappaga vem̐ḍugovayyā (||sĕppi||) semuṁchi appaḍi mādo senna vemi sesevu rāmayĕduḍigi nīvĕ rārādā yemari nīvĕṁdainā nĕṁgili segŏṁṭivo āmugŏni yippuḍe saddātmum̐ḍavu gāvayyā (||sĕppi||) yimmula māseda nĕṭṭu yĕḍavaḍa lāḍiṁchevu kŏmma nippuḍe vachchi kūḍam̐garādā yĕmmĕla śhrīveṁkaḍeśha yĕṁtavuddaṁḍīm̐ḍavainā nĕmmim̐gūḍidi vippuḍe nijamiyyavayyā