Title (Indic)చెప్పిపంప నింత యేలే చెలులచే సారెసారె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చెప్పిపంప నింత యేలే చెలులచే సారెసారె యెప్పుడును తనబుద్ది కెదురాడలేనే (॥చెప॥) తనతో నేఁ గోపగించి తనదిక్కు చూడకున్న సునిసి తా నున్న మేడ చూడకుండలేనే మనసిచ్చి తాను నేను మాటలాడకుండినా తా- ననిపినచెలితో మాటాడకుండలేనే (॥చెప్ప॥) కొంకి తన్నంట నేనని గొప్పవొట్టు వెట్టుకొన్న అంకె దాఁబండేపరపు అంటకుండలేనే నంటుచేసి తనతోనే నవ్వుది నవ్వకుండినాను గెంటుఁదనమేనిపచ్చికి నవ్వకుండలేనే (॥చెప్ప॥) సమరతి నలయక చలముదించకుండినా ఆమరఁగఁ బరవశమందకుండలేనే తెమలి శ్రీవేంకటాద్రిదేవుఁ డింత సేసి కూడె కొమెరవయసునసిగ్గులు మానలేనే English(||pallavi||) sĕppibaṁpa niṁta yele sĕlulase sārĕsārĕ yĕppuḍunu tanabuddi kĕdurāḍalene (||sĕba||) tanado nem̐ gobagiṁchi tanadikku sūḍagunna sunisi tā nunna meḍa sūḍaguṁḍalene manasichchi tānu nenu māḍalāḍaguṁḍinā tā- nanibinasĕlido māḍāḍaguṁḍalene (||sĕppa||) kŏṁki tannaṁṭa nenani gŏppavŏṭṭu vĕṭṭugŏnna aṁkĕ dām̐baṁḍebarabu aṁṭaguṁḍalene naṁṭusesi tanadone navvudi navvaguṁḍinānu gĕṁṭum̐danamenibachchigi navvaguṁḍalene (||sĕppa||) samaradi nalayaga salamudiṁchaguṁḍinā āmaram̐gam̐ baravaśhamaṁdaguṁḍalene tĕmali śhrīveṁkaḍādridevum̐ ḍiṁta sesi kūḍĕ kŏmĕravayasunasiggulu mānalene