Title (Indic)చెప్పరాదు చూపరాదు చేరి యీవలపు నేఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చెప్పరాదు చూపరాదు చేరి యీవలపు నేఁడు కప్పురపుగంధి మీఁది కరుణ నీకెట్టిదో (॥చెప్ప॥) చెలియ నీవదనము చిత్తరుపటాన వ్రాసి తెలిగన్ను లేడవంటా తెగి వేంగేలాడును నెలవై చేతప్పి రేక భుజానఁ బారితేను తలపూఁచి మెచ్చి మెచ్చితనలోనే నవ్వును (॥చెప్ప॥) అంది నీకంఠమున జంద్రాభరణము వ్రాసి సందేహించి చూడఁ జాలక పొగులును పొందుగా నీవురము బూచి తనరూపు వ్రాసి నిందల వేరొకతేని నివ్వెఱఁగుఁ బొందును (॥చెప్ప॥) శ్రీవేంకటేశ నీచెలువుఁ దొడలు వ్రాసి భావపు సిగ్గున దనపయ్యెద పైఁ గప్పున సావధానమున నీసర్వాంగములు వ్రాసి యీవల నిన్నిటు గూడి యిందు సరి చూచెను English(||pallavi||) sĕpparādu sūbarādu seri yīvalabu nem̐ḍu kappurabugaṁdhi mīm̐di karuṇa nīgĕṭṭido (||sĕppa||) sĕliya nīvadanamu sittarubaḍāna vrāsi tĕligannu leḍavaṁṭā tĕgi veṁgelāḍunu nĕlavai sedappi rega bhujānam̐ bāridenu talabūm̐si mĕchchi mĕchchidanalone navvunu (||sĕppa||) aṁdi nīgaṁṭhamuna jaṁdrābharaṇamu vrāsi saṁdehiṁchi sūḍam̐ jālaga pŏgulunu pŏṁdugā nīvuramu būsi tanarūbu vrāsi niṁdala verŏgadeni nivvĕṟam̐gum̐ bŏṁdunu (||sĕppa||) śhrīveṁkaḍeśha nīsĕluvum̐ dŏḍalu vrāsi bhāvabu sigguna danabayyĕda paim̐ gappuna sāvadhānamuna nīsarvāṁgamulu vrāsi yīvala ninniḍu gūḍi yiṁdu sari sūsĕnu