Title (Indic)చెప్పకువే నాతోడ చేరి నీ సుద్దులు నేఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చెప్పకువే నాతోడ చేరి నీ సుద్దులు నేఁడు కప్పిన నీ నేరు పెల్లాఁ గలది నాతోనా (॥చెప్పకువే॥) కానీ లేవె నే నతనిఁ గరఁగించ లే కుండితే నానఁ బెట్టి కొంత నీవు నవ్వుదు గాని పోనీ వూరకుండే యేపొద్దుదాఁకఁ గెలసేవు దాని కేమి నీ యాఁటదానితన మిందుకా (॥చెప్పకువే॥) కొంత సయించవె పతి కొరత దీరుచ కుండితే చెంతల నప్పుడె సంతంసింతువు గాని పంతము లిప్పు డేఁటికె పని గలప్పుడే కాక యింత నంతటఁ బడెనా యిల జాణతనము (॥చెపకువే॥) యిట్టె వోరుచు కుండవె యీతని రతిఁ జిక్కితే వట్టి సట నీవు దోడై వత్తువు గాని గట్టిగ శ్రీవెంకటాద్రి ఘనుఁ డిట్టె నన్ను గూడె పట్టినచలము నీకు బందె దెచ్చీనా English(||pallavi||) sĕppaguve nādoḍa seri nī suddulu nem̐ḍu kappina nī neru pĕllām̐ galadi nādonā (||sĕppaguve||) kānī levĕ ne nadanim̐ garam̐giṁcha le kuṁḍide nānam̐ bĕṭṭi kŏṁta nīvu navvudu gāni ponī vūraguṁḍe yebŏddudām̐kam̐ gĕlasevu dāni kemi nī yām̐ṭadānidana miṁdugā (||sĕppaguve||) kŏṁta sayiṁchavĕ padi kŏrada dīrusa kuṁḍide sĕṁtala nappuḍĕ saṁtaṁsiṁtuvu gāni paṁtamu lippu ḍem̐ṭigĕ pani galappuḍe kāga yiṁta naṁtaḍam̐ baḍĕnā yila jāṇadanamu (||sĕbaguve||) yiṭṭĕ vorusu kuṁḍavĕ yīdani radim̐ jikkide vaṭṭi saḍa nīvu doḍai vattuvu gāni gaṭṭiga śhrīvĕṁkaḍādri ghanum̐ ḍiṭṭĕ nannu gūḍĕ paṭṭinasalamu nīgu baṁdĕ dĕchchīnā