Title (Indic)చెలులు తన్నెవ్వరెంత చేసినాఁ జేసిరిగాని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చెలులు తన్నెవ్వరెంత చేసినాఁ జేసిరిగాని వలవని గర్వాలు వారే కట్టుకోనీవే (॥చెలు॥) పొదిగి తనగుణాలు పొగడఁగఁదగుఁగాక అద నెఱఁగక వెంగెమాడఁదగునా వెదకి తానున్నచోటు విచారించఁదగుంగాక యెదుటఁ బరాకుతో నెలయించఁదగునా (॥చెలు॥) వైళము తాఁ జెప్పినటువలెఁ జేయఁదగుంగాక నాలిసేసి తనతోఁ బెనఁగఁదగునా మేలుసేసినందుకు మెచ్చఁగఁదగుగాక కూళతనమున మరీఁ గొసరఁగఁదగునా (॥చెలు॥) వొక్కటై పొందుసేసితే నొడఁబడఁదగుఁగాక చక్కఁగా నెడమాటాడించఁగఁదగునా ఇక్కడ శ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను దక్కె నాకు నతఁడు నే దమకించఁదగునా English(||pallavi||) sĕlulu tannĕvvarĕṁta sesinām̐ jesirigāni valavani garvālu vāre kaṭṭugonīve (||sĕlu||) pŏdigi tanaguṇālu pŏgaḍam̐gam̐dagum̐gāga ada nĕṟam̐gaga vĕṁgĕmāḍam̐dagunā vĕdagi tānunnasoḍu visāriṁcham̐daguṁgāga yĕduḍam̐ barāgudo nĕlayiṁcham̐dagunā (||sĕlu||) vaiḽamu tām̐ jĕppinaḍuvalĕm̐ jeyam̐daguṁgāga nālisesi tanadom̐ bĕnam̐gam̐dagunā melusesinaṁdugu mĕchcham̐gam̐dagugāga kūḽadanamuna marīm̐ gŏsaram̐gam̐dagunā (||sĕlu||) vŏkkaḍai pŏṁduseside nŏḍam̐baḍam̐dagum̐gāga sakkam̐gā nĕḍamāḍāḍiṁcham̐gam̐dagunā ikkaḍa śhrīveṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu dakkĕ nāgu nadam̐ḍu ne damagiṁcham̐dagunā