Title (Indic)చెలులెల్లా నిందుకే సిగ్గువడేరు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చెలులెల్లా నిందుకే సిగ్గువడేరు పలుమారు నెట్టు వొడఁబరచేవయ్యా (॥చెలు॥) సంగడినున్నసతులు సరసములాడఁగాను యెంగిలాయ నీమోవి ఇప్పుడిట్టే పొంగుచు నిన్నప్పటిని భోగించేటి సతులకు యింగితాన మోహితేనె యెట్టోసఁగేవయ్యా (॥చెలు॥) పొందేవేళఁ బాదాలు నీబుజముపైఁ జాఁచఁగాను కిందుపడె నీమేను కిమ్ముల నట్టే అందముగాఁ గొత్తగాఁ బెండ్లాడేటివారికి ఇందమని కాఁగిలెట్టు ఇంపు సేసేవయ్యా (॥చెలు॥) వావులను తమతమవాఁడవు నీ వనఁగాను శ్రీవేంకటేశ అందరిశేష మైతివి యీవేళ నేలినయట్టి మావంటిసతులకెల్ల చేవదేర నీమహిమ చెప్పేదెట్లయ్యా English(||pallavi||) sĕlulĕllā niṁduge sigguvaḍeru palumāru nĕṭṭu vŏḍam̐barasevayyā (||sĕlu||) saṁgaḍinunnasadulu sarasamulāḍam̐gānu yĕṁgilāya nīmovi ippuḍiṭṭe pŏṁgusu ninnappaḍini bhogiṁcheḍi sadulagu yiṁgidāna mohidenĕ yĕṭṭosam̐gevayyā (||sĕlu||) pŏṁdeveḽam̐ bādālu nībujamubaim̐ jām̐sam̐gānu kiṁdubaḍĕ nīmenu kimmula naṭṭe aṁdamugām̐ gŏttagām̐ bĕṁḍlāḍeḍivārigi iṁdamani kām̐gilĕṭṭu iṁpu sesevayyā (||sĕlu||) vāvulanu tamadamavām̐ḍavu nī vanam̐gānu śhrīveṁkaḍeśha aṁdariśheṣha maidivi yīveḽa nelinayaṭṭi māvaṁṭisadulagĕlla sevadera nīmahima sĕppedĕṭlayyā