Title (Indic)చెల్లు నీకే యిటువంటి సేఁత లెల్లాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చెల్లు నీకే యిటువంటి సేఁత లెల్లాను యెల్లవారుఁ జూడఁగానే యిక్కువ లంటేవు (॥చెల్లు॥) వొడ్డుకొనఁగానే చెలి నొడివట్టి తీసేవు యెడ్డతన మనరా యెవ్వరైనాను వడ్డికిచ్చితివా నీవు వలపు లాపెకును అడ్డగించుకొని వచ్చి అంగడిఁ బెట్టేవు (॥చెల్లు॥) నెట్టిన సిగ్గు వడఁగానే చన్ను లంటేవు గుట్టువాయ వీఁడన కా కడ వారెల్లా జట్టి సేసికొంటివా సతితోడివేడుకలు పెట్టినివొట్లఁ బెట్టి పెనఁగు లాడేవు (॥చెల్లు॥) అండ నిట్టే మొక్కఁగానే అలయించి కూడేవు దుండగ మిది యనరా తోడివారె ల్లా దండిగానింతి నేలి దయతో శ్రీవేంకటేశ కొండ సేసుకొంటివా యీ గురుతైన రతులు English(||pallavi||) sĕllu nīge yiḍuvaṁṭi sem̐ta lĕllānu yĕllavārum̐ jūḍam̐gāne yikkuva laṁṭevu (||sĕllu||) vŏḍḍugŏnam̐gāne sĕli nŏḍivaṭṭi tīsevu yĕḍḍadana manarā yĕvvarainānu vaḍḍigichchidivā nīvu valabu lābĕgunu aḍḍagiṁchugŏni vachchi aṁgaḍim̐ bĕṭṭevu (||sĕllu||) nĕṭṭina siggu vaḍam̐gāne sannu laṁṭevu guṭṭuvāya vīm̐ḍana kā kaḍa vārĕllā jaṭṭi sesigŏṁṭivā sadidoḍiveḍugalu pĕṭṭinivŏṭlam̐ bĕṭṭi pĕnam̐gu lāḍevu (||sĕllu||) aṁḍa niṭṭe mŏkkam̐gāne alayiṁchi kūḍevu duṁḍaga midi yanarā toḍivārĕ llā daṁḍigāniṁti neli dayado śhrīveṁkaḍeśha kŏṁḍa sesugŏṁṭivā yī gurudaina radulu