Title (Indic)చెల్లఁబో యింకాఁ జెప్ప సిగ్గు గాదా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చెల్లఁబో యింకాఁ జెప్ప సిగ్గు గాదా చెల్లె నీవు సేసినట్టి సేఁత లెల్లాఁ గంటిని (॥చెల్ల॥) చెక్కు నీవు నొక్కేవు చెయి వట్టి పెనఁగేవు యెక్కడి మాటలు యిఁక నేలా నేఁడు వక్కణించఁ బనిలేదు వావి చెప్పఁ జోటు లేదు మొక్కేము తొలవయ్య మోహమెల్లాఁ గంటిమి (॥చెల్ల॥) సెలవుల నవ్వేవు చెరఁగు వట్టి తీసేవు ఇలమీఁద వట్టిదూరు లవి గొన్నే చలములు నీకు దక్కె సడి నామీఁద నిలిచీ తెలిసితి నుండవయ్య తేజమెల్లాఁ గంటమి (॥చెల్లు॥) కన్నులనే కొసరేవు కాఁగిటి బిగించేవు యెన్న లేవు నీసుద్దు లెరఁగనివా నన్ను నిట్టె కూడితివి నమ్మించి శ్రీవేంకటేశ మన్నించి పూరకుండు నీ మతకాలు గంటిమి English(||pallavi||) sĕllam̐bo yiṁkām̐ jĕppa siggu gādā sĕllĕ nīvu sesinaṭṭi sem̐ta lĕllām̐ gaṁṭini (||sĕlla||) sĕkku nīvu nŏkkevu sĕyi vaṭṭi pĕnam̐gevu yĕkkaḍi māḍalu yim̐ka nelā nem̐ḍu vakkaṇiṁcham̐ baniledu vāvi sĕppam̐ joḍu ledu mŏkkemu tŏlavayya mohamĕllām̐ gaṁṭimi (||sĕlla||) sĕlavula navvevu sĕram̐gu vaṭṭi tīsevu ilamīm̐da vaṭṭidūru lavi gŏnne salamulu nīgu dakkĕ saḍi nāmīm̐da nilisī tĕlisidi nuṁḍavayya tejamĕllām̐ gaṁṭami (||sĕllu||) kannulane kŏsarevu kām̐giḍi bigiṁchevu yĕnna levu nīsuddu lĕram̐ganivā nannu niṭṭĕ kūḍidivi nammiṁchi śhrīveṁkaḍeśha manniṁchi pūraguṁḍu nī madagālu gaṁṭimi