Title (Indic)చెలియా ఆ మేలుసుద్ది చెప్పవే నాకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చెలియా ఆ మేలుసుద్ది చెప్పవే నాకు వెలకా వేగు(?) నిందాఁక వేగించితినే (॥చెలి॥) ఆఁపరానితమకాన నాడకే వచ్చేనంటి రాఁపుతోడ నే నద్దమరాతిరికాడ కాఁపురపువారేమన్నాఁ గసరుకొంటా నుంటి నీపలుకు విన్నదాఁకా నిలుచుంటినే (॥చెలి॥) వలపు నిలుపలేక వాకిటనె కాచుకున్నా తెలతెలవారేటి తెరువు కాడ చలపట్టి యీతనికె సగినాలు గోరుకొంటి వెలయ నాతనియిల్లే వెదకితినే (॥చెలి॥) ఆతని నాతొంటి పొందు లన్నియుఁ దలఁచుకొంటి ఱాతిగుండెతోడఁ దనఱట్టైనచోట యేతుల శ్రీవేంకటేశుఁ డింటికిఁ బిలిచి కూడె నాతమకాన మరచి నవ్వులు నవ్వితినే English(||pallavi||) sĕliyā ā melusuddi sĕppave nāgu vĕlagā vegu(?) niṁdām̐ka vegiṁchidine (||sĕli||) ām̐parānidamagāna nāḍage vachchenaṁṭi rām̐pudoḍa ne naddamarādirigāḍa kām̐purabuvāremannām̐ gasarugŏṁṭā nuṁṭi nībalugu vinnadām̐kā nilusuṁṭine (||sĕli||) valabu nilubalega vāgiḍanĕ kāsugunnā tĕladĕlavāreḍi tĕruvu kāḍa salabaṭṭi yīdanigĕ saginālu gorugŏṁṭi vĕlaya nādaniyille vĕdagidine (||sĕli||) ādani nādŏṁṭi pŏṁdu lanniyum̐ dalam̐sugŏṁṭi ṟādiguṁḍĕdoḍam̐ danaṟaṭṭainasoḍa yedula śhrīveṁkaḍeśhum̐ ḍiṁṭigim̐ bilisi kūḍĕ nādamagāna marasi navvulu navvidine