Title (Indic)చెలిచెలువ మేమని చెప్పేమయ్యా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చెలిచెలువ మేమని చెప్పేమయ్యా అలమేలుమంగ నీకె యమరు నన్నిటాను (॥చెలి॥) కొమ్మమోముఁదమ్మి మీదికుంతలపుఁదుమ్మిదలు సమ్మతిఁ జంద్రాస్యనేత్రచకోరములు నెమ్మి నధరపుఁదేనె నిందునవ్వు వెన్నెలలు వుమ్మడి నుండఁగ నంటనోడి భ్రమసెను (॥చెలి॥) మెలుతనాభిసరసిమీఁదిచనుజక్కనలు మలసి కుహరనాభి మధ్యసింహము అలరు వళితరంగాలు అందపుటారనుపాము చెలఁగివుండఁగాఁ బ్రవేశించక భ్రమసెను (॥చెలి॥) తరుణిఘనకటిపులినతలపు గతిహంసలు కరిశిరోనితంబోరుకాండకరులు వరుసఁ జెమటేరు యౌవనవనము నుండఁగా గురు శ్రీవేంకటేశుఁడ కూడఁగా భ్రమసెను English(||pallavi||) sĕlisĕluva memani sĕppemayyā alamelumaṁga nīgĕ yamaru nanniḍānu (||sĕli||) kŏmmamomum̐dammi mīdiguṁtalabum̐dummidalu sammadim̐ jaṁdrāsyanetrasagoramulu nĕmmi nadharabum̐denĕ niṁdunavvu vĕnnĕlalu vummaḍi nuṁḍam̐ga naṁṭanoḍi bhramasĕnu (||sĕli||) mĕludanābhisarasimīm̐disanujakkanalu malasi kuharanābhi madhyasiṁhamu alaru vaḽidaraṁgālu aṁdabuḍāranubāmu sĕlam̐givuṁḍam̐gām̐ braveśhiṁchaga bhramasĕnu (||sĕli||) taruṇighanagaḍibulinadalabu gadihaṁsalu kariśhironidaṁborugāṁḍagarulu varusam̐ jĕmaḍeru yauvanavanamu nuṁḍam̐gā guru śhrīveṁkaḍeśhum̐ḍa kūḍam̐gā bhramasĕnu