Title (Indic)చెలిమోము చూచిప్పుడు సిగ్గులువడేవు నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చెలిమోము చూచిప్పుడు సిగ్గులువడేవు నీవు తలఁపించనా నేను తక్కించేవుగాక (॥చెలి॥) ముంచి చెలివిరహము మొన్ననే విన్నవించనా అంచెలతో వొద్దికి రావైతివి గాక కంచము పొత్తు కొరకే కానుక చేతికియ్యవా యెంచుకోక మఱచితివేమోకాక (॥చెలి॥) నెలాతచిత్తము ఎంత నిన్ననే యెచ్చరించనా అలముక బుజ్జగించవైతివిగాక కలయుమనుచు నీకు కుడుఁ బ్రియముచెప్పనా నలిరేఁగి కవకవ నవ్వితివిగాక (॥చెలి॥) అంగనఅలపులెల్లా నప్పుడే నీకుఁ జూపనా అంగవించి పంతమియ్యవైతివిగాక రంగుగ శ్రీవేంకటేశ రతి నిట్టె కూడితివి యింగిత మెంచనా మెచ్చే వింతలోనేకాక English(||pallavi||) sĕlimomu sūsippuḍu sigguluvaḍevu nīvu talam̐piṁchanā nenu takkiṁchevugāga (||sĕli||) muṁchi sĕlivirahamu mŏnnane vinnaviṁchanā aṁchĕlado vŏddigi rāvaidivi gāga kaṁchamu pŏttu kŏrage kānuga sedigiyyavā yĕṁchugoga maṟasidivemogāga (||sĕli||) nĕlādasittamu ĕṁta ninnane yĕchchariṁchanā alamuga bujjagiṁchavaidivigāga kalayumanusu nīgu kuḍum̐ briyamusĕppanā nalirem̐gi kavagava navvidivigāga (||sĕli||) aṁganaalabulĕllā nappuḍe nīgum̐ jūbanā aṁgaviṁchi paṁtamiyyavaidivigāga raṁguga śhrīveṁkaḍeśha radi niṭṭĕ kūḍidivi yiṁgida mĕṁchanā mĕchche viṁtalonegāga