Title (Indic)సంగతిగా మాఁటలాడ జాణ వౌదువె । నీ । WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) సంగతిగా మాఁటలాడ జాణ వౌదువె । నీ । సంగతి గలదు గాన జాణనె పో యెపుడు (॥సంగతి॥) యెక్కువఁ బయ్యదలోని వేఁటివె యింతి అవి పక్కనె వలపు నించే పైఁడికుండలు పెక్కువ మేడలమీఁదఁ బెట్టవచ్చుఁబో నీవు మిక్కిలి నెప్పుడు నుండే మేడవో నాదేహము (॥సంగతి॥) హెచ్చె నీమైఁ బులక లివేఁటికె యింతి అవి ముచ్చట మోహపునోము మొలకలురా పెచ్చుగా దేవరమీఁదఁ బెట్టచ్చుఁబో నీవె వచ్చి వరము లిచ్చే దేవరవెపో నాకును (॥సంగతి॥) యినుమడించెఁ జెమట లేఁటికే యింతి రతిఁ దనివోని కళలెల్ల దైలువారెరా అనువై అట్లానైతె అగ్గువాయఁబో నన్ను ఘనమై కూడితి శ్రీవేంకటనాథుఁడా. English(||pallavi||) saṁgadigā mām̐ṭalāḍa jāṇa vauduvĕ | nī | saṁgadi galadu gāna jāṇanĕ po yĕbuḍu (||saṁgadi||) yĕkkuvam̐ bayyadaloni vem̐ṭivĕ yiṁti avi pakkanĕ valabu niṁche paim̐ḍiguṁḍalu pĕkkuva meḍalamīm̐dam̐ bĕṭṭavachchum̐bo nīvu mikkili nĕppuḍu nuṁḍe meḍavo nādehamu (||saṁgadi||) hĕchchĕ nīmaim̐ bulaga livem̐ṭigĕ yiṁti avi muchchaḍa mohabunomu mŏlagalurā pĕchchugā devaramīm̐dam̐ bĕṭṭachchum̐bo nīvĕ vachchi varamu lichche devaravĕbo nāgunu (||saṁgadi||) yinumaḍiṁchĕm̐ jĕmaḍa lem̐ṭige yiṁti radim̐ danivoni kaḽalĕlla dailuvārĕrā anuvai aṭlānaidĕ agguvāyam̐bo nannu ghanamai kūḍidi śhrīveṁkaḍanāthum̐ḍā.