Title (Indic)చంచలము మానితేను సంసారమే సుఖము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చంచలము మానితేను సంసారమే సుఖము పొంచి హరిదాసుఁడైతే భూమెల్లా సుఖము (॥చంచ॥) వొరుల వేఁడకవుంటే వున్నచోనే సుఖము పరనింద విడిచితే భావమెల్లా సుఖము సరవిఁ గోపిఁచకుంటే జన్మ మెల్లా సుఖమే హరిఁ గొలిచినవారి కన్నిటాను సుఖమే (॥చంచ॥) కాని పని సేయకుంటే కాయమే సుఖము మౌనమున నుండితేను మరులైనా సుఖము దీనత విడిచితేను దినములెల్లా సుఖము ఆని హరిఁ దలఁచితే నంతటా సుఖమే (॥చంచ॥) చలము విడిచితేను సంతతము సుఖము యిల నాసలుడిగితే నిహమెల్లా సుఖమే తలఁగి శ్రీవేంకటేశు దాసులైనవారు వీని గెలిచి నటించఁగాను కిందా మీఁదా సుఖమే English(||pallavi||) saṁchalamu mānidenu saṁsārame sukhamu pŏṁchi haridāsum̐ḍaide bhūmĕllā sukhamu (||saṁcha||) vŏrula vem̐ḍagavuṁṭe vunnasone sukhamu paraniṁda viḍiside bhāvamĕllā sukhamu saravim̐ gobim̐saguṁṭe janma mĕllā sukhame harim̐ gŏlisinavāri kanniḍānu sukhame (||saṁcha||) kāni pani seyaguṁṭe kāyame sukhamu maunamuna nuṁḍidenu marulainā sukhamu dīnada viḍisidenu dinamulĕllā sukhamu āni harim̐ dalam̐side naṁtaḍā sukhame (||saṁcha||) salamu viḍisidenu saṁtadamu sukhamu yila nāsaluḍigide nihamĕllā sukhame talam̐gi śhrīveṁkaḍeśhu dāsulainavāru vīni gĕlisi naḍiṁcham̐gānu kiṁdā mīm̐dā sukhame