Title (Indic)సమ మోహములతోడ సంగడి భ్రమతతోడ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) సమ మోహములతోడ సంగడి భ్రమతతోడ నిమిషము సందేహించి నిలిచి రిద్దరును (॥సమ॥) వనితకుచంబులు వనజంబులు హరి- కనుచూపుతామరలు కలబెరకై యెనసి చిక్కువడి యేరుపరచఁగరాక నినుపునివ్వెరగుల నిలిచి రిద్దరును (॥సమ॥) కాంతచెక్కుటద్దముల ఘనునిచెక్కుటద్దాల- కాంతి నిద్దరిచూపులు కలబెరకై అంతలోనే తమమేను లవె తడఁబడెనని వింతలై నిలిచి రట్టె వెరగై యిద్దరును (॥సమ॥) చెలిబాహులతలును శ్రీవేంకటేశ్వరుని- కలయుబాహులతలు కలబెరకై అలమి మరుకేళిని అవి యేర్పరచరాక నెలకొన్న మరపున నిలిచి రిద్దరును English(||pallavi||) sama mohamuladoḍa saṁgaḍi bhramadadoḍa nimiṣhamu saṁdehiṁchi nilisi riddarunu (||sama||) vanidagusaṁbulu vanajaṁbulu hari- kanusūbudāmaralu kalabĕragai yĕnasi sikkuvaḍi yerubarasam̐garāga ninubunivvĕragula nilisi riddarunu (||sama||) kāṁtasĕkkuḍaddamula ghanunisĕkkuḍaddāla- kāṁti niddarisūbulu kalabĕragai aṁtalone tamamenu lavĕ taḍam̐baḍĕnani viṁtalai nilisi raṭṭĕ vĕragai yiddarunu (||sama||) sĕlibāhuladalunu śhrīveṁkaḍeśhvaruni- kalayubāhuladalu kalabĕragai alami marugeḽini avi yerbarasarāga nĕlagŏnna marabuna nilisi riddarunu