Title (Indic)చలిమీ బలిమీఁ గద్దు సలిగేఁ గద్దు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చలిమీ బలిమీఁ గద్దు సలిగేఁ గద్దు వలపు చవులుగొన్న వనితను నేను (॥చలిమి॥) వేసరించనోపము వేమారు నిన్నును వాసితోడనుండేము వాకిలి గాచి నేసవెట్టితివి నాఁడే చేతులెత్తి నామీఁద దోసిటిపాల పెండ్లికూఁతురను నేను (॥చలిమి॥) సారె దూరనోపము సాటికి బేటికి నిన్ను బీరమున నుండేము నీపీఁటవద్దను బార చాఁచితివి నాఁడే పక్కన నాకాఁగిటికి కూరిమిఁ గాలుదొక్కిన కొమ్మను నేను (॥చలిమి॥) కక్కసించినోపము కడు శ్రీ వేంకటేశ్వర యిక్కువఁ గూడుండేము నీ ఇంటిలోనను దిక్కై యేలితివి నాఁడే తిరమైన రతులను వొక్కటైన పట్టపుదేవులను నేను English(||pallavi||) salimī balimīm̐ gaddu saligem̐ gaddu valabu savulugŏnna vanidanu nenu (||salimi||) vesariṁchanobamu vemāru ninnunu vāsidoḍanuṁḍemu vāgili gāsi nesavĕṭṭidivi nām̐ḍe sedulĕtti nāmīm̐da dosiḍibāla pĕṁḍligūm̐turanu nenu (||salimi||) sārĕ dūranobamu sāḍigi beḍigi ninnu bīramuna nuṁḍemu nībīm̐ṭavaddanu bāra sām̐sidivi nām̐ḍe pakkana nāgām̐giḍigi kūrimim̐ gāludŏkkina kŏmmanu nenu (||salimi||) kakkasiṁchinobamu kaḍu śhrī veṁkaḍeśhvara yikkuvam̐ gūḍuṁḍemu nī iṁṭilonanu dikkai yelidivi nām̐ḍe tiramaina radulanu vŏkkaḍaina paṭṭabudevulanu nenu