Title (Indic)చల మిఁకఁ బనిలేదు జలజాక్షి కడుసాదు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చల మిఁకఁ బనిలేదు జలజాక్షి కడుసాదు యెలమితో నిట్టె మాయింటికి రారాదా (॥చల॥) చేరి యింతి ప్రియములే చెప్పీ నిదే నీకుఁ జాటి కోరికలైతే మదిఁ గోటానఁగోటి మేర మీరరాదు యీపెమేనరిక మిఁకఁ బోదు యీరీతి మమ్ము మన్నించి ఇంటికి రారాదా (॥చల॥) కొమ్మ నిన్నుఁ దలపోసి కురిసీఁ జెమటవాన చిమ్మి రేఁగేవలపైతే సేనాసేన నమ్మిన చుట్టాలు మీరు నంటున నొద్దికైనారు ఇమ్ముల నీకు మొక్కేము ఇంటికి రారాదా (॥చల॥) యెన్నఁడుఁ బాయనిరతి యీకె నీమోహపుటాలు విన్నపములెల్లాఁ జేసీ వేవేలు చిన్ననాఁడె యీడుచూపె శ్రీవేంకటేశుఁడ యీపె యెన్నికగాఁ గూడితివి ఇంటికి రారాదా English(||pallavi||) sala mim̐kam̐ baniledu jalajākṣhi kaḍusādu yĕlamido niṭṭĕ māyiṁṭigi rārādā (||sala||) seri yiṁti priyamule sĕppī nide nīgum̐ jāḍi korigalaide madim̐ goḍānam̐goḍi mera mīrarādu yībĕmenariga mim̐kam̐ bodu yīrīdi mammu manniṁchi iṁṭigi rārādā (||sala||) kŏmma ninnum̐ dalabosi kurisīm̐ jĕmaḍavāna simmi rem̐gevalabaide senāsena nammina suṭṭālu mīru naṁṭuna nŏddigaināru immula nīgu mŏkkemu iṁṭigi rārādā (||sala||) yĕnnam̐ḍum̐ bāyaniradi yīgĕ nīmohabuḍālu vinnabamulĕllām̐ jesī vevelu sinnanām̐ḍĕ yīḍusūbĕ śhrīveṁkaḍeśhum̐ḍa yībĕ yĕnnigagām̐ gūḍidivi iṁṭigi rārādā