Title (Indic)చక్కనివాఁడ వన్నిటా జాణవు నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చక్కనివాఁడ వన్నిటా జాణవు నీవు మక్కువ నీకుఁ జేయుటే మాభాగ్యము గాదా (॥॥) వన్నె కెక్క నీకు నేను వలవ నావసమా కన్నులనే చూచి చొక్కఁ గలఁ గాక చన్నుల నోత్తి కాఁగిలించఁగ నావసములా సన్నలనే నీమోవి చవిగొంట గాక (॥॥) ఆయమెరిఁగి పెనఁగ నప్పటి నావసమా కాయమంటి సంతోసించఁగలఁ గాక చేయిముట్టి నే నిన్నుఁ జెనకఁగ వసమా చాయలకు నీతో సరసమాడుట గాక (॥॥) పిలిచి నిన్ను రతులఁ గలయఁ గ వసమా చెలరేఁ గి నీసేవ సేయుట గాక యెలమి శ్రీ వేంకటేశ యిన్నిటా నన్నేలితివి తలఁ చ నిన్ను వసమా తగులుట గాక English(||pallavi||) sakkanivām̐ḍa vanniḍā jāṇavu nīvu makkuva nīgum̐ jeyuḍe mābhāgyamu gādā (||||) vannĕ kĕkka nīgu nenu valava nāvasamā kannulane sūsi sŏkkam̐ galam̐ gāga sannula notti kām̐giliṁcham̐ga nāvasamulā sannalane nīmovi savigŏṁṭa gāga (||||) āyamĕrim̐gi pĕnam̐ga nappaḍi nāvasamā kāyamaṁṭi saṁtosiṁcham̐galam̐ gāga seyimuṭṭi ne ninnum̐ jĕnagam̐ga vasamā sāyalagu nīdo sarasamāḍuḍa gāga (||||) pilisi ninnu radulam̐ galayam̐ ga vasamā sĕlarem̐ gi nīseva seyuḍa gāga yĕlami śhrī veṁkaḍeśha yinniḍā nannelidivi talam̐ sa ninnu vasamā taguluḍa gāga