Title (Indic)చక్కని యీ వెన్నుఁడూ సంబటూరి చెన్నుఁడూ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చక్కని యీ వెన్నుఁడూ సంబటూరి చెన్నుఁడూ అక్కడ నిక్కడ చూపి ఆసలు రేఁచీని (॥చక్కని॥) చెన్నునిఁ జూడఁ గదరే చెలులాల నేఁడు చిన్ని లేనవ్వులనె చెలరేఁగీని సన్నలు నేసీ వాఁడె సటకాఁడు నాతో యెన్నటి కెన్నటి పొందు యిపుడే రేఁచీని (॥చక్కని॥) యే మనీనె చెన్నుఁడూ యేకతాన నన్నునూ దొమిటివావులు నాపైఁ దొరలించీని కోమలపు చేయి చాఁచీ కొత్తపెండ్లికొడుకు గామిడితనాల నన్నుఁ గాకలు రేఁచీని (॥చక్కని॥) శ్రీవెంకటాద్రిమీద చేరి కూడెఁ జెన్నుఁడు బావించి పచ్చడము పైఁ గప్పీని మోవి చూపీఁ గమ్మటి మెక్కళీఁడు వీఁడు దేవుఁడు గదవే వీఁడు తీపులు రేఁచీని English(||pallavi||) sakkani yī vĕnnum̐ḍū saṁbaḍūri sĕnnum̐ḍū akkaḍa nikkaḍa sūbi āsalu rem̐sīni (||sakkani||) sĕnnunim̐ jūḍam̐ gadare sĕlulāla nem̐ḍu sinni lenavvulanĕ sĕlarem̐gīni sannalu nesī vām̐ḍĕ saḍagām̐ḍu nādo yĕnnaḍi kĕnnaḍi pŏṁdu yibuḍe rem̐sīni (||sakkani||) ye manīnĕ sĕnnum̐ḍū yegadāna nannunū dŏmiḍivāvulu nābaim̐ dŏraliṁchīni komalabu seyi sām̐sī kŏttabĕṁḍligŏḍugu gāmiḍidanāla nannum̐ gāgalu rem̐sīni (||sakkani||) śhrīvĕṁkaḍādrimīda seri kūḍĕm̐ jĕnnum̐ḍu bāviṁchi pachchaḍamu paim̐ gappīni movi sūbīm̐ gammaḍi mĕkkaḽīm̐ḍu vīm̐ḍu devum̐ḍu gadave vīm̐ḍu tībulu rem̐sīni