Title (Indic)సకలజీవులకెల్ల సంజీవి యీమందు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) సకలజీవులకెల్ల సంజీవి యీమందు వెకలులై యిందరు సేవించరో యీమందు (॥సకల॥) మూఁడులోకము లొక్కట ముంచి పెరిగినది పోఁడిమి నల్లవికాంతిఁ బొదలినది పేఁడుక కొమ్ములు నాల్గు పెనచి చేయివారినది నాఁడే శేషగిరిమీద నాఁటుకొన్నమందు (॥సకల॥) పడిగెలు వేయింటిపాము గాచుకున్నది కడువేదశాస్త్రముల గబ్బు వేసేది యెడయక వొకకాంత యెక్కువ వుండినది కడలేనియంజనాద్రిగారుడపుమందు (॥సకల॥) బలుశంఖుజక్రములబదనికె లున్నది తలఁచినవారికెల్లఁ దత్వమైనది అలరినబ్రహ్మరుద్రాదులఁ బుట్టించినది వెలుఁగుతోడుత శ్రీవేంకటాద్రిమందు English(||pallavi||) sagalajīvulagĕlla saṁjīvi yīmaṁdu vĕgalulai yiṁdaru seviṁcharo yīmaṁdu (||sagala||) mūm̐ḍulogamu lŏkkaḍa muṁchi pĕriginadi pom̐ḍimi nallavigāṁtim̐ bŏdalinadi pem̐ḍuga kŏmmulu nālgu pĕnasi seyivārinadi nām̐ḍe śheṣhagirimīda nām̐ṭugŏnnamaṁdu (||sagala||) paḍigĕlu veyiṁṭibāmu gāsugunnadi kaḍuvedaśhāstramula gabbu vesedi yĕḍayaga vŏgagāṁta yĕkkuva vuṁḍinadi kaḍaleniyaṁjanādrigāruḍabumaṁdu (||sagala||) baluśhaṁkhujakramulabadanigĕ lunnadi talam̐sinavārigĕllam̐ datvamainadi alarinabrahmarudrādulam̐ buṭṭiṁchinadi vĕlum̐gudoḍuda śhrīveṁkaḍādrimaṁdu