Title (Indic)సకలదేవతలు నీ శరీరమని సర్వేశ్వర నిను దలఁచుట మేలు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) సకలదేవతలు నీ శరీరమని సర్వేశ్వర నిను దలఁచుట మేలు వికట మేల నిను యేకాగ్రబుద్ధిని వేడుకతో సేవించే నిఁకను (॥సకల॥) శివదుర్గారవిగణాధిప క్షేత్రపాలక సహితముగా భువిలో మిమ్మును పంచపూజగాఁ బూజింతురు కొందరు తివిరి యిందరును బంతినే పొత్తుల దేవరలై పొరి చూపు సేతు రని వివరముగా నిన్నేఁ గొలిచితి నీ వే వహించుకొని రక్షించవే (॥సకల॥) బహు విద్యాధరభేతాళ బ్రహ్మరాక్షసగణాదుల సహచరుఁగా మిమ్ముఁ గామ్యకర్మముల సారెభజింతురు కొందరు మహిమలు చూపుచు వేల్పులదండై మనసులవంతులు వెదకుదురనుచును విహితధర్మమని నిను శరణంటిని వెలయఁగ నను దయఁజూడఁ గదే (॥సకల॥) అతిమాయాయంత్రతంత్రమం త్రాంతర సాధనయుక్తముగా యితరులు గొందరు చిల్లర తెరువుల యెనయించి మిమ్ము నర్చింతురు తతినివి తమలో నన్యోన్యవిరుద్ధము లనియపాయసహితము లనియును గతి యంటిని యలమేలుమంగకును పతి శ్రీవేంకటేశుఁడ కావవే English(||pallavi||) sagaladevadalu nī śharīramani sarveśhvara ninu dalam̐suḍa melu vigaḍa mela ninu yegāgrabuddhini veḍugado seviṁche nim̐kanu (||sagala||) śhivadurgāravigaṇādhiba kṣhetrabālaga sahidamugā bhuvilo mimmunu paṁchabūjagām̐ būjiṁturu kŏṁdaru tiviri yiṁdarunu baṁtine pŏttula devaralai pŏri sūbu sedu rani vivaramugā ninnem̐ gŏlisidi nī ve vahiṁchugŏni rakṣhiṁchave (||sagala||) bahu vidyādharabhedāḽa brahmarākṣhasagaṇādula sahasarum̐gā mimmum̐ gāmyagarmamula sārĕbhajiṁturu kŏṁdaru mahimalu sūbusu velbuladaṁḍai manasulavaṁtulu vĕdaguduranusunu vihidadharmamani ninu śharaṇaṁṭini vĕlayam̐ga nanu dayam̐jūḍam̐ gade (||sagala||) adimāyāyaṁtradaṁtramaṁ trāṁtara sādhanayuktamugā yidarulu gŏṁdaru sillara tĕruvula yĕnayiṁchi mimmu narsiṁturu tadinivi tamalo nanyonyaviruddhamu laniyabāyasahidamu laniyunu gadi yaṁṭini yalamelumaṁgagunu padi śhrīveṁkaḍeśhum̐ḍa kāvave