Title (Indic)చతురుఁడ వన్నిటాను జనార్దనా మమ్ము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చతురుఁడ వన్నిటాను జనార్దనా మమ్ము సతముగా నేలితివి జనార్దనా (॥చతు॥) సమమోహాలు మనవి జనార్దనా యిట్టె జమళి నున్నార మిదె జనార్దనా సమకూడెఁగా లెస్స జనార్దనా నీ సముక మెవ్వరి కబ్బు జనార్దనా (॥చతు॥) చవులాయె సరసాలు జనార్దనా పెండ్లి చవికెలో మనకు జనార్ధనా సవరని వాఁడవు జనార్దనా మరి సవతు లేరు నీకు జనార్దనా (॥చతు॥) సంకె దీరఁ గూడితివి జనార్దనా నీకు చంక లెత్తి మొక్కేము జనార్దనా జంకించకు శ్రీవేంకట జనార్దనా శంకుఁజక్రములచేతి జనార్దనా English(||pallavi||) sadurum̐ḍa vanniḍānu janārdanā mammu sadamugā nelidivi janārdanā (||sadu||) samamohālu manavi janārdanā yiṭṭĕ jamaḽi nunnāra midĕ janārdanā samagūḍĕm̐gā lĕssa janārdanā nī samuga mĕvvari kabbu janārdanā (||sadu||) savulāyĕ sarasālu janārdanā pĕṁḍli savigĕlo managu janārdhanā savarani vām̐ḍavu janārdanā mari savadu leru nīgu janārdanā (||sadu||) saṁkĕ dīram̐ gūḍidivi janārdanā nīgu saṁka lĕtti mŏkkemu janārdanā jaṁkiṁchagu śhrīveṁkaḍa janārdanā śhaṁkum̐jakramulasedi janārdanā