Title (Indic)చదివేవి వేదము లాచారము మదిఁ బట్టడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చదివేవి వేదము లాచారము మదిఁ బట్టడు మదనాతురుఁడ నాకు మంచితన మేది (॥చదివే॥) ముట్ట యోగ్యము గానివి మోచితిఁ దోలు నెమ్ములు అట్టె బ్రతికేననే ఆసలు బెట్టు జట్టిగాఁ బ్రాణము తీపు చావంటే వెలుతు నేను యిట్టి యజ్ఞానికి జ్ఞాన మెట్టు గలిగీని (॥చదివే॥) కావలె ననుచుఁ గోరి కడుపు నించిన రుచి యీపల హేయమై వెళ్లీ యేఁ జూడగానే దావతి మనసందుకే తగిలీఁ గాని రోయదు భావించి నన్నెంఱుఁగని భావ మెఱిఁగీనా (॥చదివే॥) యోని గతుఁడనై పుట్టి యోనికి మగ్నుఁడనైతి పూని లోకబండఁ డనే బుద్దెఱిఁగీ నేనా యెంత సిగ్గెబుఁగ నీవే విచారించి కావు శ్రీనిథి శ్రీ వేంకటేశ చేతిలోని వాఁడను English(||pallavi||) sadivevi vedamu lāsāramu madim̐ baṭṭaḍu madanādurum̐ḍa nāgu maṁchidana medi (||sadive||) muṭṭa yogyamu gānivi mosidim̐ dolu nĕmmulu aṭṭĕ bradigenane āsalu bĕṭṭu jaṭṭigām̐ brāṇamu tību sāvaṁṭe vĕludu nenu yiṭṭi yajñānigi jñāna mĕṭṭu galigīni (||sadive||) kāvalĕ nanusum̐ gori kaḍubu niṁchina rusi yībala heyamai vĕḽlī yem̐ jūḍagāne dāvadi manasaṁduge tagilīm̐ gāni royadu bhāviṁchi nannĕṁṟum̐gani bhāva mĕṟim̐gīnā (||sadive||) yoni gadum̐ḍanai puṭṭi yonigi magnum̐ḍanaidi pūni logabaṁḍam̐ ḍane buddĕṟim̐gī nenā yĕṁta siggĕbum̐ga nīve visāriṁchi kāvu śhrīnithi śhrī veṁkaḍeśha sediloni vām̐ḍanu